తానా ఆధ్వర్యంలో మాస్క్‌ల పంపిణీ కార్యక్రమం

ABN , First Publish Date - 2020-04-01T04:02:41+05:30 IST

తెలుగు ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ వస్తున్న తానా తాజాగా హైదరాబాద్‌లో మాస్క్‌ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది. సామాన్య ప్రజలతో పాటు

తానా ఆధ్వర్యంలో మాస్క్‌ల పంపిణీ కార్యక్రమం

తెలుగు ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ వస్తున్న తానా తాజాగా హైదరాబాద్‌లో మాస్క్‌ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది. 


సామాన్య ప్రజలతో పాటు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న పోలీసులు, పారిశుధ్య కార్మికులకు తానా వాలంటీర్లు మాస్క్‌లు పంపిణీ చేశారు. 


తానా సభ్యులు శివ పోలవరపు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది. మంగళవారం హైదరాబాద్‌లోని ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీ స్టేషన్ ప్రాంతాల వరకు తానా వాలంటీర్లు రీయూజబుల్ మాస్క్‌లను అందజేస్తూ వచ్చారు.


 రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని అనేక నగరాల్లో మాస్క్‌ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తానా సభ్యులు తెలిపారు. కాగా.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లకు తానా సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-04-01T04:02:41+05:30 IST