Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

డల్లాస్‌లో కోలాహాలంగా TANA క్రికెట్ సంబరాలు

twitter-iconwatsapp-iconfb-icon
డల్లాస్‌లో కోలాహాలంగా TANA క్రికెట్ సంబరాలు

డల్లాస్‌, మే 31: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) డల్లాస్‌ స్పోర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహవంతులైన క్రీడాకారులతో మే 28 తేది నుంచి 30 మే వరకు అద్భుతంగా జరిగింది. ముందుగా డల్లాస్‌ RVP సతీష్ కొమ్మన, తానా జాతీయ స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ శశాంక్ యార్లగడ్డ, తానా ఫౌండేషన్ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు, తానా కౌన్సిలర్ ఎట్ లార్జ్ లోకేష్ నాయుడు, తానా DFW స్పోర్ట్స్ సమన్వయకర్త వెంకట్ బొమ్మ, రాజేష్ చెరుకుపల్లి , క్రీడాకారులకు స్వాగతం పలికి టోర్నమెంట్‌ను ప్రారంబిచారు. రాబోయే కాలంలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ సారధ్యంలో తానా జాతీయ స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ శశాంక్ యార్లగడ్డ సమన్వయంతో మరిన్ని మంచి క్రీడా కార్యక్రమాలను తీసుకు వస్తున్నామని, తానా కార్యక్రమాలలో అందరు పాల్గొనవలసిందిగా కోరారు.

డల్లాస్‌లో కోలాహాలంగా TANA క్రికెట్ సంబరాలు

క్రీడాకారులు, ఔత్సాహికులు క్రికెట్ ఆట ఆడాలంటే డల్లాస్‌లో మాత్రమే ఆడాలి అనుకునే విధంగా తెలుగు అసొసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అన్నిహంగులు కలిగిన స్థానిక రసెల్ క్రీక్ పార్కు క్రీడా సముదాయంలో చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు. ఈ ఆటల పోటీలకు గ్రాండ్ స్పాన్సర్‌గా దేవాన్ష్ ల్యాబ్స్, గోల్డ్ స్పాన్సర్‌గా టెక్ స్టార్, ఈవెంట్ స్పాన్సర్స్‌గా శ్రీకాంత్ పోలవరపు, సతీష్ కొమ్మన ముఖ్య దాతలుగా వ్యవహరించారు. ఇరవై జట్లు, మూడు వందల యాభై మంది క్రీడాకారులు, స్వచ్చంద కార్యకర్తలు అమితమైన ఉత్సాహంతో ఈ టోర్నీలో పాల్గొన్నారు. అదరహో అనే విధంగా మంచి క్రీడాకారులు మంచి ఆటతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. 

డల్లాస్‌లో కోలాహాలంగా TANA క్రికెట్ సంబరాలు

తానా విన్నర్ కప్‌ను టెక్నీ హైర్ టైగర్స్ (కెప్టెన్ గంగాధర్ వంకా & టీమ్), రన్నరప్ కప్‌ను విల్లో వారియర్స్ (కెప్టెన్ రాజా అడైకలసామీ  &టీమ్) జట్లు గెల్చుకున్నాయి. విన్నర్స్ టీంకు 1500 డాలర్ల(రూ.1,16,429) ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీ, మెడల్స్ ఇచ్చారు. అలాగే రన్నరప్ టీంకు 750 డాలర్ల(రూ.58,214) ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీ, మెడల్ ఇచ్చి ఘనంగా సత్కరించారు. బెస్ట్ బ్యాట్స్‌మన్ ఆఫ్ ది సీరీస్‌గా విల్లో వారియర్ టీమ్ నుంచి ఏకలవ్య, బెస్ట్ బౌలర్ ఆఫ్ ది సీరీస్‌గా రాజా అడైకలసామీ, ఆల్ రౌండర్ ఆఫ్ ది సీరీస్‌గా టెక్నీ హైర్ టైగర్ టీమ్ ఆటగాడు శివ శంకర్ కొమరి గెల్చుకొని అందరి మన్ననలు పొందారు.

డల్లాస్‌లో కోలాహాలంగా TANA క్రికెట్ సంబరాలు

తానా డల్లాస్ RVP సతీష్ కొమ్మన, తానా జాతీయ స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ శశాంక్ యార్లగడ్డ, తానా కౌన్సిలర్ ఎట్ లార్జ్ లోకేష్ నాయుడు, తానా ఫౌండేషన్ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు, తానా బోర్డ్ ఆఫ్ డైరక్టర్ మురళి వెన్నం క్రీడలు మానసిక వికాసానికి తోడ్పడతాయని, పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసి, విజేతలను అభినదించారు. TANA డల్లాస్ వివిద కమిటీ సభ్యులు లెనిన్ వీర, చినసత్యం వీర్నపు, ప్రమోద్ నూతేటి, సుధీర్ చింతమనేని, దిలీప్ చండ్ర, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తానా DFW స్పోర్ట్స్ సమన్వయకర్త వెంకట్ బొమ్మ స్వచ్ఛంద కార్యకర్తలు, గ్రౌండ్ ఇచ్చిన సిటీ ఆఫ్ ప్లేనో, కుల్జీత్ సింగ్, అంపైర్ల్, tV9, tv5 మీడియా వారికి, స్పాన్సర్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

డల్లాస్‌లో కోలాహాలంగా TANA క్రికెట్ సంబరాలు


డల్లాస్‌లో కోలాహాలంగా TANA క్రికెట్ సంబరాలు


డల్లాస్‌లో కోలాహాలంగా TANA క్రికెట్ సంబరాలు


డల్లాస్‌లో కోలాహాలంగా TANA క్రికెట్ సంబరాలు


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement

ఓపెన్ హార్ట్Latest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.