Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

అమ్మకు నీరాజనం.. 'తానా' ఆధ్వర్యంలో ఘనంగా మదర్స్ డే సెలబ్రేషన్స్‌!

twitter-iconwatsapp-iconfb-icon
అమ్మకు నీరాజనం.. తానా ఆధ్వర్యంలో ఘనంగా మదర్స్ డే సెలబ్రేషన్స్‌!

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ మే 6 న నార్త్ కెరొలినా రాష్ట్రం, చార్లెట్ నగరంలో నిర్వహించిన మదర్స్ డే సెలబ్రేషన్స్.. అమ్మకు నీరాజనం పలికాయి. తానా ప్రాంతీయ కార్యదర్శి నాగ పంచుమర్తి, విమెన్ ఎంపవర్మెంట్ ఛైర్ మాధురి ఏలూరి ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఈ సెలబ్రేషన్స్‌కు 400 మందికి పైగా మహిళలు హాజరయ్యారు. ముందుగా ఆహుతులందరికి మదర్స్ డే శుభాకాంక్షలతో స్వాగతం పలికి, విఘ్నేశ్వరుడిని సేవిస్తూ పాడిన పాటతో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. వర్జీనియా నుంచి అతిథిగా విచ్చేసిన ప్రముఖ ఫ్యాషన్ మోడల్ చైతన్య పోలోజు.. అందరితో కలివిడిగా తిరుగుతూ కార్యక్రమానికి వన్నె తెచ్చారు.

అమ్మకు నీరాజనం.. తానా ఆధ్వర్యంలో ఘనంగా మదర్స్ డే సెలబ్రేషన్స్‌!

సోలో, గ్రూప్ నృత్యాలు, స్కిట్లు, ఫ్యాషన్ షో, ఆట పాటలు ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రెండు తరాల అమ్మల ఫ్యాషన్ షో ఈ మదర్స్ డే సెలబ్రేషన్స్ కే హైలైట్. దీంతో అందరూ తమ తమ అమ్మలతో మధురస్మృతులను నెమరు వేసుకున్నారు. అలాగే సద్గురు లీడ్ చేస్తున్న సేవ్ సాయిల్ ఉద్యమానికి మద్దతుగా చేసిన నాటకం అందరినీ ఆలోచింపచేసింది. ఇక తెలుగు సినీ గాయని సత్య యామిని తన పాటలతో ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగించింది. బాహుబలి, అఖండ, అల వైకుంఠపురంలో, వకీల్ సాబ్, రాధే శ్యామ్, అరవింద సమేత వంటి తాజా చిత్రాలలోని మెలోడీస్‌తో అబ్బురపరిచింది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన మధు నెక్కంటి సమయానుసారంగా పదునైన సంభాషణలతో ఈవెంట్‌ను ముందుకు నడిపించారు. 

అమ్మకు నీరాజనం.. తానా ఆధ్వర్యంలో ఘనంగా మదర్స్ డే సెలబ్రేషన్స్‌!

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, టీం స్క్వేర్ ఛైర్మన్ సురేష్ కాకర్ల, అలాగే స్థానిక అపలాచియన్ నాయకులు పురుషోత్తమ చౌదరి గుదె, ఠాగూర్ మల్లినేని, రమణ అన్నె, సచీన్ద్ర ఆవులపాటి, రవి నాయుడు, రామ్ అల్లు, కేదార్ బలిసెట్టి, శ్రీపాద కాసు లను వేదిక మీదకు ఆహ్వానించగా, తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు వారికి మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపి, తానా కార్యక్రమాలను వివరించారు. తదనంతరం తానా అపలాచియన్ రీజియన్ ప్రాంతీయ కార్యదర్శి నాగ పంచుమర్తి పరలోకంలో ఉన్న తన మాతృమూర్తి గురించి గత అనుభవాలను పంచుకున్నారు. దీంతో కార్యక్రమానికి విచ్చేసిన మాతృమూర్తులందరూ వేదిక పైకి వచ్చి మేమున్నామంటూ కేక్ కట్ చేసి మనోస్థయిర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా ‘అమ్మల అమ్మలకు ప్రత్యేకంగా..’ అంటూ నాగ పంచుమర్తి కుటుంబం సమర్పించిన రాఫుల్ బహుమతులు అందించారు.

అమ్మకు నీరాజనం.. తానా ఆధ్వర్యంలో ఘనంగా మదర్స్ డే సెలబ్రేషన్స్‌!

డైమండ్ రింగ్స్, గోల్డ్ కాయిన్స్, ఖరీదైన చీరలతో గ్రాండ్ ర్యాఫుల్ బహుమతులతోపాటు, రిటర్న్ గిఫ్ట్స్ మరియు సర్ప్రైజ్ గిఫ్ట్ బాక్సులతో మహిళలు ఆనందంగా కనిపించారు. షాపింగ్ స్టాల్ల్స్ మహిళలను బాగా ఆకట్టుకున్నాయి. మొట్టమొదటిసారిగా వేదికపై ఏర్పాటుచేసిన డిజిటల్ స్క్రీన్, మ్యాజిక్ మంత్ర నుంచి కవిత చేసిన చక్కని అలంకరణ, డీజే మురళి, బాలాజి మంద ఫోటోగ్రఫీ, ఘుమఘుమలాడే ఎగ్జిక్యూటివ్ స్టైల్ విందు భోజనం అన్నీ కూడా కార్యక్రమానికి రిచ్ నెస్ తెచ్చాయి. ఈ తానా మదర్స్‌డే సెలబ్రేషన్స్‌ను మహిళలకు ప్రత్యేకంగా,  అత్యంత ప్రణాళికా బద్ధంగా నిర్వహించిన తానా అపలాచియన్ రీజియన్ ప్రాంతీయ కార్యదర్శి నాగ పంచుమర్తి, విమెన్ ఎంపవర్మెంట్ ఛైర్ మాధురి ఏలూరిని ఆహుతులందరూ అభినందించారు.

అమ్మకు నీరాజనం.. తానా ఆధ్వర్యంలో ఘనంగా మదర్స్ డే సెలబ్రేషన్స్‌!

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన శ్రీనాధ్ గింజుపల్లి, ఉపేంద్ర సాయిరాం కిలారు, రమ్య పెద్ది, సౌమ్య శ్రీ, దీప్తి నన్నపనేని, స్వప్న కొల్లూరు, పద్మ నున్న, పల్లవి కొల్లిపర, దీప ఉప్పల, మంజూష పూనాటి, మణి కొట్టె, శిరీష అనుముకొండ, విజయ నెల్లి, విజయ ఒగ్గు, నీలిమ దేవినేని, వసంత కావూరి, ప్రదీప్తి, సౌజన్య బండ్లమూడి, ప్రుణితారెడ్డి, వాణి గొర్రెపాటి, ఉషారాణి, ఝాన్సీ అబ్బూరి, జ్యోత్స్న గంటా, పద్మజ కొమ్మినేని, రూప తలశిల, వినీషా సాదినేని, ఇతర ఆహుతులకు కృతఙ్ఞతలు తెలిపి కార్యక్రమాన్ని ముగించారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.