కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం : తమ్మినేని వీరభద్రం

ABN , First Publish Date - 2020-07-13T19:04:09+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తెలంగాణలో కట్టడి చేయడంలో

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం : తమ్మినేని వీరభద్రం

వరంగల్ అర్బన్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తెలంగాణలో కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఇవాళ వరంగల్‌ మీడియా మీట్ ఏర్పాటు చేసిన ఆయన.. ప్రవేట్ ఆసుపత్రుల్ల్లో దోపిడీ జరుగుతున్నా దాన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. కరోనా బాధితులకు వైద్యం అందించటం కోసం ప్రైవేట్ ఆసుపత్రులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. కరోనా కట్టడి చేయాలని 16న తెలంగాణ వ్యాప్తంగా జిల్లా కేంద్రంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టబోతున్నామని వీరభద్రం తెలిపారు. 


విరసం నేత వరవరరావును వెంటనే విడుదల చేయాలని తమ్మినేని డిమాండ్ చేశారు. వరవరరావును విడుదల చేయాలని ప్రజాసంఘాలు కోరినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. వరవరరావును విడుదల చేసి మెరుగైన వైద్యం అందించాలని తమ్మినేని డిమాండ్ చేశారు. కాగా.. మహారాష్ట్ర జైల్లో ఉన్న వరవరావును విడుదలయ్యేలా చూడాలని ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏపీ సీపీఐ నేత రామకృష్ణ లేఖలు రాసిన విషయం విదితమే.

Updated Date - 2020-07-13T19:04:09+05:30 IST