ఈటల రాజేందర్ విలువలు గల మనిషి: తమ్మినేని

ABN , First Publish Date - 2021-07-28T23:27:28+05:30 IST

ఈటల రాజేందర్ విలువలు గల మనిషి: తమ్మినేని

ఈటల రాజేందర్ విలువలు గల మనిషి: తమ్మినేని

కరీంనగర్: దేశవ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షాల నేతల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. కరోనాను నియంత్రించడంలో మోడీ సర్కారు విఫలమైందన్నారు. ఇప్పటి వరకు 15 శాతమే వ్యాక్సిన్లు ఇచ్చారని చెప్పారు. పది లక్షలు నేరుగా దళితులకు ఇచ్చి వారిష్టమైన పనిచేసుకునే స్వేచ్ఛ ఇవ్వడం సరికాదన్నారు. పది లక్షలు నగదు పంచకుండా... వారు ఏ విధమైన ఉపాధి పొందుతారో తెలుసుకుని వాటికి నిధులు వెచ్చించాలని అన్నారు. 


మూడెకరాల భూమి ఇస్తామని దళితులను ఊరించి మాట తప్పారని వ్యాఖ్యానించారు. మరియమ్మ లాకప్ డెత్ విషయంలో ప్రభుత్వ చర్యను ప్రశంసిస్తున్నామని, కానీ గతంలో దళితులపై జరిగిన దాడులపై చర్యలేవి? అని ప్రశ్నించారు. దళితబంధు రాష్ట్రమంతా చేస్తామని.. ఒక్క హుజురాబాద్‌లోనే 2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ తీసుకుపోవడాన్ని సీపీఎం ఖండిస్తోందన్నారు. ఈటల రాజేందర్ విలువలు గల మనిషన్నారు. ఆయన పట్ల తమకు గౌరవం ఉందని, చెడ్డ పార్టీలో ఈటల రాజేందర్ మంచి మనిషి చేరారని చెప్పారు. షర్మిల పార్టీతో పాటు ఎన్ని పార్టీలు కొత్తగా వచ్చినా స్వాగతిస్తామన్నారు.

Updated Date - 2021-07-28T23:27:28+05:30 IST