Abn logo
Oct 5 2021 @ 13:31PM

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి: తమ్మినేని

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ బుద్ధి మార్చుకుని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం బుద్ధి  మార్చుకోకపోతే  వచ్చే ఎన్నికల్లో ఓట్లు రావన్నారు. మనసు మార్చుకుంటే మళ్ళీ ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారన్నారు. పోలీసులు ఉన్నది శాంతి భద్రతలను కాపాడటానికి, పౌరులకు  సేవలు అందించడానికి మాత్రమేనని, అడవుల్లోకి వెళ్ళి పోడు భూముల రైతులపై కేసులు పెట్టడానికి కాదని అన్నారు. పోలీసులు ప్రవర్తన మార్చుకోకపోతే వారిపై కూడా కేసులు పెట్టాల్సి వస్తుందని తమ్మినేని వీర భద్రం హెచ్చరించారు.

ఇవి కూడా చదవండిImage Caption