కోహ్లీ ఫిట్‌నెస్ చూసి.. నా మీద నాకే సిగ్గేసింది: తమీమ్ ఇక్బాల్

ABN , First Publish Date - 2020-06-03T00:26:13+05:30 IST

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ చూసి.. తన మీద తనకే సిగ్గేసిందని బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ వెల్లడించాడు. కోహ్లీ తాను

కోహ్లీ ఫిట్‌నెస్ చూసి.. నా మీద నాకే సిగ్గేసింది: తమీమ్ ఇక్బాల్

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ చూసి.. తన మీద తనకే సిగ్గేసిందని బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ వెల్లడించాడు. కోహ్లీది తనది ఒకే వయస్సు అయినప్పుడు..  అతనిలా తాను ఎందుకు చేయలేకపోతున్నానని అనుకొనే వాడినని అతను పేర్కొన్నాడు. సంజయ్ మంజ్రేకర్‌తో నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో అతను ఈ విషయాలను వెల్లడించాడు. 


‘‘ఇది నేను ఒక ఇండియన్ కామెంటేటర్‌తో మాట్లాడుతున్న అని చెప్పడం లేదు. భారత్ మా పక్క దేశం.. భారత్‌లో జరిగే విషయాల ప్రభావం బంగ్లాదేశ్‌పై ఉంటుంది. భారత్‌లో ఫిట్‌నెస్ ప్రక్రియ మారినప్పుడు.. అది మా దేశంపై కూడా ప్రభావం చూపింది. ఈ విషయం చెప్పడానికి నేను సిగ్గుపడటం లేదు. రెండు-మూడేళ్ల క్రికెట్ విరాట్ కోహ్లీ పరిగెత్తడం నేను చూశాను. అప్పుడు నా మీ నాకే సిగ్గేసింది. అతను నా వయస్సు వాడే.. కానీ ఎంతో ట్రైనింగ్ తీసుకన్నాడు. నేను అందులో సగం కూడా చేయలేదు’’ అని తమీమ్ పేర్కొన్నాడు. 

Updated Date - 2020-06-03T00:26:13+05:30 IST