Chennai: రాష్ట్రానికి 90 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా

ABN , First Publish Date - 2021-10-28T14:36:28+05:30 IST

రాష్ట్రానికి 90 వేల మెట్రిక్‌ టన్నుల మేరకు యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో సాంబా(రబీ) సాగుకు గాను 20వేల మెట్రిక్‌ టన్నుల డీఏపీ యూరియాను 10 వేల మెట్రి

Chennai: రాష్ట్రానికి 90 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా

చెన్నై(Tamilnadu): రాష్ట్రానికి 90 వేల మెట్రిక్‌ టన్నుల మేరకు యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు  జారీ చేసింది. రాష్ట్రంలో సాంబా(రబీ) సాగుకు గాను 20వేల మెట్రిక్‌ టన్నుల డీఏపీ యూరియాను 10 వేల మెట్రిక్‌ టన్నుల పొటాష్‌ను అదనంగా కేటాయించాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్‌ మాన్‌సుఖ్‌ మాండవ్యాకు ఈ నెల 21న లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం కారైక్కాల్‌ ఓడరేవుకు చేరనున్న 90 వేల మెట్రిక్‌ టన్నుల యూరియాను రాష్ట్రానికి కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రానికి ఇదివరకే స్పిక్‌ సంస్థ ద్వారా 25 వేల మెట్రిక్‌ టన్నుల యూనియాను సరఫరా చేసినట్టు ఆ ఉత్తర్వులో పేర్కొంది. ప్రస్తుతం కారైక్కాల్‌ ఓడరేవు వద్ద నాలుగు వేల మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వలున్నాయని, వాటిని రైళ్ళ ద్వారా అవసరమైన జిల్లాలకు సరఫరా చేయవచ్చునని కూడా కేంద్ర ప్రభుత్వం సూచించింది.

Updated Date - 2021-10-28T14:36:28+05:30 IST