తమిళనాడులో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఒక్కరోజులో 1438

ABN , First Publish Date - 2020-06-06T03:27:37+05:30 IST

తమిళనాడులో కరోనా కట్టడి క్లిష్టమవుతోంది. రాష్ట్రంలో నానాటికీ పాజిటివ్ కేసులు పెరుగుతూనే...

తమిళనాడులో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఒక్కరోజులో 1438

చెన్నై: తమిళనాడులో కరోనా కట్టడి క్లిష్టమవుతోంది. రాష్ట్రంలో నానాటికీ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తోడు ఐదు రోజులుగా రాష్ట్రంలో ప్రతిరోజూ వెయ్యికి పైగా కేైసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ రోజు కూడా 1,438 తాజా కేసుుల రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సీ విజయ భాస్కర్ తెలిపారు. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,438 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 12 మంది మరణించారని తెలిపారు. వీటితో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 28,694కి చేరిందని, వీరిలో 15,762 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 12,687 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు.  కరోనా కారణంగా ఇప్పటివరకు 232 మరణాలు సంభవించినట్లు చెప్పారు.

Updated Date - 2020-06-06T03:27:37+05:30 IST