వెయ్యేళ్లనాటి ఆలయాల జీర్ణోద్ధరణ

ABN , First Publish Date - 2022-04-09T14:15:54+05:30 IST

రాష్ట్రంలో వెయ్యేళ్లనాటి 197 ఆలయాల్లో త్వరలో జీర్ణోద్ధరణ పనులు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర హిందూ దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు తెలిపారు. కేకేనగర్‌లోని శక్తి వినాయకుడి ఆలయంలో

వెయ్యేళ్లనాటి ఆలయాల జీర్ణోద్ధరణ

                      - మంత్రి పీకే శేఖర్‌బాబు


చెన్నై: రాష్ట్రంలో వెయ్యేళ్లనాటి 197 ఆలయాల్లో త్వరలో జీర్ణోద్ధరణ పనులు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర హిందూ దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు తెలిపారు. కేకేనగర్‌లోని శక్తి వినాయకుడి ఆలయంలో రూ.58లక్షలతో చేపట్టనున్న జీర్ణోద్ధరణ పనులకు శుక్రవారం ఉదయం ఆయన శ్రీకారం చుట్టారు.. ఆ ఆలయంలోని కల్యాణమండపంలో ఏసీ సదుపాయాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయాలు,చర్చిలు, మసీదుల్లో అభివృద్ధి పనులు చేపడుతోందని చెప్పారు. ప్రతివారం 150ఆలయాల్లో జీర్ణోద్ధరణ పనులు చేపట్టేందుకు అనుమతిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో గత పదినెలల్లో 507 ఆలయాల్లో జీర్ణోద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించి రూ.664 కోట్లతో ఆ పనులను ఇటీవలే ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. ఇదే విధంగా రాష్ట్రం లో వందేళ్లనాటి ఆలయాల వివరాలను కూడా సేకరించి ఆ ఆలయాల్లో కుంభాభిషేకం నిర్వహించడానికి తగు చర్యలు చేపడతామన్నారు.

Updated Date - 2022-04-09T14:15:54+05:30 IST