కలైవానర్‌ అరంగంలోనే అసెంబ్లీ సమావేశాలు

ABN , First Publish Date - 2022-01-02T14:21:38+05:30 IST

రాష్ట్రంలో కొత్త ఆంక్షలతో కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులోకి రావటంతో శాసనసభ సమావేశాలు స్థానిక చేపాక్‌లోని కలైవానర్‌ అరంగంలోనే నిర్వహించనున్నట్లు శాసనసభ కార్యదర్శి శ్రీనివాసన్‌ ప్రకటించారు. కొత్త యేడాది

కలైవానర్‌ అరంగంలోనే అసెంబ్లీ సమావేశాలు

చెన్నై: రాష్ట్రంలో కొత్త ఆంక్షలతో కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులోకి రావటంతో శాసనసభ సమావేశాలు స్థానిక చేపాక్‌లోని కలైవానర్‌ అరంగంలోనే నిర్వహించనున్నట్లు శాసనసభ కార్యదర్శి శ్రీనివాసన్‌ ప్రకటించారు. కొత్త యేడాది తొలి శాసనసభ సమా వేశాలు ఈ నెల 5వ తేదీన ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలను సెయింట్‌జార్జి కోటలోని అసెంబ్లీలో జరపాలని తొలుత నిర్ణయించారు. ఆ మేరకు అసెంబ్లీలో మరమ్మతులు కూడా జరిగాయి. సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి కెమెరాలు తదితర ఏర్పాట్లు కూడా చేపట్టారు. ఈ పరిస్థితుల్లో ‘ఒమైక్రాన్‌’ వ్యాప్తి అధికమవుతున్న కారణంగా కొత్త ఆంక్షలతో లాక్‌డౌన్‌ విధించటంతో శాసనసభ సమావేశాలను కొవిడ్‌ నిబంధనల నడుమ కలైవానర్‌ అరంగంలోనే నిర్వహించనున్నారు. ఈ నెల ఐదున గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి.

Updated Date - 2022-01-02T14:21:38+05:30 IST