Abn logo
Mar 29 2021 @ 08:44AM

మంత్రి సహా ఐదుగురిపై కేసు నమోదు


చెన్నై: తిరుపత్తూర్‌ జిల్లా జోలార్‌పేటలో అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి వీరమణి ఎన్నికల ఆర్గనైజర్‌ వస్తున్న కారును తనిఖీ చేసిన అధికారులు కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి జోలార్‌పేట సమీపంలో వాహన తనిఖీలు చేపడుతుండగా ఆ సమయంలో అటుగా వచ్చిన మారుతి కారును ఆపి  పరిశీలించగా, మంత్రి వీరమణి ఎన్నికల ఆర్గనైజర్‌ అయగిరి ఓటర్లకు పంచేందుకు చీరలు, పంచెలు, టీ-షర్ట్‌లు, పీఎంకే, అన్నాడీఎంకే జెండా బార్డర్లతో కూడిన పంచెలు వుండడం గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి తగిన దస్తావేజులు లేకుండా వీటిని తరలిస్తున్నారని పేర్కొంటూ, అభ్యర్థి, మంత్రి వీరమణి, ఎన్నికల ఆర్గనైజర్‌ అయగిరి, ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమాని విక్రమ్‌, కారు డ్రైవర్‌, కారు యజమానిపై అధికారులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.


Advertisement
Advertisement