వ్యభిచార ముఠా అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-08-10T17:08:31+05:30 IST

వ్యభిచార ముఠా అరెస్ట్‌

వ్యభిచార ముఠా అరెస్ట్‌

చెన్నై: స్థానిక రెడ్‌హిల్స్‌ ప్రాంతంలో ఇంటి అద్దెకు తీసుకొని వ్యభిచారానికి పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెడ్‌హిల్స్‌కు చెందిన ఓ లారీ డ్రైవర్‌ రెండవ భార్య రతి (42) ఉండే ఇంట్లోకి ఈ నెల 5వ తేది రాత్రి ఐదు మోటార్‌సైకిల్‌ వాహనాల్లో వచ్చిన ఓ ముఠా ప్రవేశించింది. రతి, ఆమె కుటుంబసభ్యులను బెదిరించి వారిని కట్టివేసి,  14 సవర్ల నగదు, రూ.10 వేలు చోరీ చేసి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు చేపట్టిన విచారణలో, వారు మీంజూరు, మాత్తూరు ప్రాంతాలకు చెందిన వారని గుర్తించి వారిని అరెస్ట్‌ చేసి విచారించగా, రతి తన ఇంట్లో కొందరు యువతులను రప్పించి వ్యభిచారం చేయిస్తుందని పేర్కొన్నారు. దీంతో, రతిపై కూడా కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Updated Date - 2020-08-10T17:08:31+05:30 IST