Abn logo
Jun 18 2021 @ 03:32AM

వైద్య పరీక్షల కోసం నేడు అమెరికాకు రజనీ

చెన్నై, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నారు. శుక్రవారం ప్రత్యేక విమానంలో కు టుంబ సభ్యులతో కలసి వెళ్తారని కోలీవుడ్‌ వర్గాలు తెలిపాయి. 3 నెలల పాటు ఆయన అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. 2011లో కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడిన రజనీకాంత్‌ ఆ సమయంలో సింగపూర్‌లో వైద్యం చేయించుకున్నారు. తర్వాత అమెరికా వెళ్లి పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కిడ్నీ మార్పిడి చికిత్స చేసి పదేళ్లు కావడంతో ఇప్పుడు మరోమారు వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్తున్నారు.