తమిళంలో 47 వేల మంది ఫెయిల్‌

ABN , First Publish Date - 2022-06-22T17:58:17+05:30 IST

టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో 47 వేల మంది విద్యార్థులు తమిళంలో ఫెయిల్‌ కావడం ఉపాధ్యాయులు, తమిళ పండితులను దిగ్ర్భాంతికి గురిచేసింది. అదే విధంగా గణితంలో 83 వేల

తమిళంలో 47 వేల మంది ఫెయిల్‌

చెన్నై, జూన్‌ 21: టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో 47 వేల మంది విద్యార్థులు తమిళంలో ఫెయిల్‌ కావడం ఉపాధ్యాయులు, తమిళ పండితులను దిగ్ర్భాంతికి గురిచేసింది. అదే విధంగా గణితంలో 83 వేల మంది ఉతీర్ణులు కాలేదు. ఇక తమిళ పరీక్షల్లో తిరుచెందూర్‌కు చెందిన దుర్గ నూటికి నూరు మార్కులు సాధించింది. పరీక్షలు రాసిన వారిలో 60 వేల మంది విద్యార్థులు, 23 వేల మంది విద్యార్థినులు కలిపి 9.11 శాతం మంది గణితంలో ఉత్తీర్ణులు కాలేదు. ఇక, సోషల్‌లో 8.14 శాతం, సైన్స్‌లో 6.33 శాతం, ఆంగ్లంలో 3.82 శాతం మంది ఫెయిల్‌ అయ్యారు. అలాగే, తమిళంలో 37 వేల మంది విద్యార్థులు, 10 వేల మంది విద్యార్థినులు మొత్తం 47 వేలు (5.16 శాతం) మంది ఉత్తీర్ణులు కాలేదు.


Updated Date - 2022-06-22T17:58:17+05:30 IST