Abn logo
Aug 11 2020 @ 18:54PM

మహేష్ బాబు కోసం మొక్కలు నాటిన ఇలయదళపతి

తన పుట్టినరోజును పురస్కరించుకుని ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న మహేశ్‌ బాబు.. ఆదివారం ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసంలో మూడు మొక్కలు నాటిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మొక్కలు పెంచడం వల్ల ఎంత ఉపయోగమో తెలిపారు. ఇది ఛాలెంజ్ కాదు.. భవిష్యత్ తరాల మనుగడకు ప్రొటెక్షన్ ప్లాన్ అని తెలిపిన మహేష్.. ఈ ఛాలెంజ్‌కు యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌, తమిళ హీరో ఇలయదళపతి విజయ్‌, హీరోయిన్‌ శ్రుతీహాసన్‌లను నామినేట్ చేశారు. అయితే విజయ్ విసిరిన ఛాలెంజ్‌ను తమిళ స్టార్ హీరో ఇలయదళపతి విజయ్ స్వీకరించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటుతున్న ఫొటోలను తన ట్వీట్‌లో పోస్ట్ చేశారు. 


‘‘మహేష్‌గారు నేను మొక్కలు నాటేది మీకోసం.. ఇక ఈ మొక్కలు ఆకుపచ్చని భారతావని మరియు మంచి ఆరోగ్యం కోసం..ధన్యవాదాలు.. క్షేమంగా ఉండండి’’ అని విజయ్ తన ట్వీట్‌లో పేర్కొంటూ.. తను మొక్కలు నాటుతున్న ఫొటోలను షేర్ చేశారు. ఇక మహేష్ బాబు విసిరిన ఛాలెంజ్‌ని త్వరలోనే తీసుకుంటానని శృతిహాసన్ ఇప్పటికే తెలిపింది. తారక్ కూడా మహేష్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తారేమో చూద్దాం. ఇదిలా ఉంటే మహేష్ చెప్పగానే ఛాలెంజ్ స్వీకరించిన విజయ్‌కు ఆయన అభిమానులు ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. 


Advertisement
Advertisement
Advertisement