ఈ భార్యాభర్తలు.. యూట్యూబ్‌లో సెన్సేషన్.. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారంటే..

ABN , First Publish Date - 2021-06-19T02:40:01+05:30 IST

తమిళనాడు యూట్యూబర్ మదన్‌ను చెన్నై పోలీసులు ఈ రోజు (శుక్రవారం) అరెస్ట్ చేశారు.

ఈ భార్యాభర్తలు.. యూట్యూబ్‌లో సెన్సేషన్.. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారంటే..

బ్యాన్ చేసిన పబ్‌జీ గేమ్‌ను లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ అసభ్యపదజాలంతో మహిళలను దూషించిన తమిళనాడు యూట్యూబర్ మదన్‌ను చెన్నై పోలీసులు ఈ రోజు (శుక్రవారం) అరెస్ట్ చేశారు. ఆ ఛానల్ అడ్మిన్ అయిన ఆయన భార్య కృతికను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన వీరిద్దరూ అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది. 


తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మదన్ కుమార్, అతని భార్య కృతిక.. `మదన్‌`, `టాక్సిక్‌ మదన్‌ 18+`, `పబ్జీ మదన్‌ గర్ల్‌ ఫ్యాన్‌` అనే పేర్లతో యూట్యూబ్ చానల్స్‌ను నడుపుతున్నారు. వీరి ఛానెల్స్‌కు 8 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. వీరిలో సంపన్నకుటుంబాలకు చెందిన చిన్న పిల్లలే అధికం. ఈ ఛానల్స్‌లో గేమింగ్ ట్రిక్స్‌కు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసేవారు. వీరి సంపాదన నెలకు రూ.3 లక్షల వరకు ఉండేది. భారత్‌లో బ్యాన్ చేసిన పబ్‌జీ గేమ్‌ను ఇటీవల ఆడుతూ బూతులతో మదన్ లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. ఈ వీడియోలో మహిళలను అవమానిస్తూ, దూషిస్తూ అతడు చేసిన వ్యాఖ్యలపై వివాదం చేలరేగింది. దీంతో చెన్నైకి చెందిన ఓ వ్యక్తి మదన్‌పై ఫిర్యాదు చేశాడు. దీంతో మదన్‌ను, అతని భార్యను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. 


Updated Date - 2021-06-19T02:40:01+05:30 IST