తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు... తిరుచ్చిలో 26 శాతం పోలింగ్...

ABN , First Publish Date - 2022-02-19T18:09:41+05:30 IST

తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ శనివారం

తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు... తిరుచ్చిలో 26 శాతం పోలింగ్...

చెన్నై : తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. తిరుచ్చి నగరంలోని 65 వార్డుల్లో ఉదయం 11 గంటల వరకు 26.64 శాతం ఓట్లు పోలయ్యాయి. తిరుచ్చి జిల్లాలోని స్థానిక సంస్థల్లో ఉదయం 11 గంటల వరకు 29.09 శాతం ఓట్లు పోలయ్యాయి. 648 అర్బన్ లోకల్ బాడీస్‌లోని 12,607 వార్డుల్లో 57,778 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 


సేలం జిల్లాలో ఉదయం 11 గంటల వరకు నమోదైన ఓట్లను పరిశీలించినపుడు, కార్పొరేషన్‌లో 23.84 శాతం, మునిసిపాలిటీలో 30.44 శాతం, టౌన్ పంచాయతీలో 32.92 శాతం ఓట్లు పోలయ్యాయి. థేని జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 27.28 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెన్నై కార్పొరేషన్ కమిషనర్ గగన్‌దీప్ సింగ్ బేడీ కోరారు. యాక్టర్ విజయ్ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు కారులో రావడంతో ఆయన అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగారు. పోలింగ్ బూత్ వద్ద ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటంతో ఆయన క్షమాపణ చెప్పారు. 


పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్ రామదాస్, ఆయన సతీమణి సరస్వతి తిండివనం మునిసిపాలిటీలోని 19వ వార్డులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 


Updated Date - 2022-02-19T18:09:41+05:30 IST