Sri Lanka : శ్రీలంకకు తొలి దశ సాయం సిద్ధం : తమిళనాడు మంత్రి

ABN , First Publish Date - 2022-05-18T23:53:00+05:30 IST

తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక (Sri Lanka)కు సాయపడేందుకు

Sri Lanka : శ్రీలంకకు తొలి దశ సాయం సిద్ధం : తమిళనాడు మంత్రి

చెన్నై : తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక (Sri Lanka)కు సాయపడేందుకు తమిళనాడు (Tamil Nadu) రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. రూ.28 కోట్ల విలువైన మందులను ఆ దేశానికి అందజేయాలని శాసన సభ ఇటీవల ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఇందులో భాగంగా తొలి దశలో రూ.8.87 కోట్ల విలువైన మందులను పంపించేందుకు సన్నాహాలు చేస్తోంది. చెన్నై నౌకాశ్రయం నుంచి నౌక ద్వారా ఈ మందులను పంపించబోతోంది.


ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రహ్మణ్యం ఆదివారం చెన్నైలోని గోదాములో ఉన్న ఈ మందులను  తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, రెండు రోజుల్లో శ్రీలంకకు మందులను సరఫరా చేస్తామని చెప్పారు. రూ.28 కోట్ల విలువైన 137 రకాల మందులను పంపిస్తున్నట్లు తెలిపారు. తొలి దశలో దాదాపు రూ.8 కోట్ల విలువైన మందులను పంపిస్తామన్నారు. సింహళీయులు, తమిళులు అనే భేదం లేకుండా మానవాతావాదంతో ఈ సహాయాన్ని పంపిస్తున్నామన్నారు. 


తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) ఏప్రిల్ 29న శాసన సభలో ఓ తీర్మానాన్ని ప్రతిపాదించారు. శ్రీలంకకు బియ్యం, పప్పులు, పాల ఉత్పత్తులు, మందులను పంపించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ తీర్మానం ద్వారా కోరారు. 


Updated Date - 2022-05-18T23:53:00+05:30 IST