Abn logo
Sep 21 2021 @ 18:50PM

7.5% కోటా విద్యార్థులకు ఉచిత విద్య: స్టాలిన్

చెన్నై: వృత్తి విద్యా కోర్సుల్లో తమిళనాడు ప్రభుత్వం కల్పించిన 7.5 శాతం కోటా కింద ఎంపికైన విద్యార్థులకు విద్యకు సంబంధించి (ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఫీజులు సహా ఇతరత్రా) పూర్తి బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ సంస్థల్లో అందించే ఇంజనీరింగ్, అగ్రకల్చర్, వెటర్నటీ, లా ఇతర ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులకు సంబంధించి 7.5 శాతం రిజర్వేషన్లు అందిస్తామని కొద్ది రోజుల క్రితం సీఎం స్టాలిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఈ కోటా కింద ఎంపిక చేసిన 12,000 విద్యార్థులను ఎంపిక చేశారు. ఇందులో 50 మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి స్టాలిన్ సోమవారం అడ్మిషన్ లెటర్స్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘7.5 శాతం కోటా ద్వారా వృత్తివిద్యా కోర్సుల్లో చేరే విద్యార్థులకు అన్ని వసతులత ఉచిత విద్య అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే ప్రయత్నంలో భాగంగా ఈ రిజర్వేషన్ తీసుకువచ్చాం’’ అని అన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption