Tamil Nadu: పటాకుల దుకాణంలో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి

ABN , First Publish Date - 2022-06-22T23:38:17+05:30 IST

తమిళనాడు(Tamilnadu)లోని డిండిగల్‌(Dindigul)లో విషాదకరమైన ఘటన జరిగింది. ఓ పటాకుల దుకాణం( firecracker shop)లో అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. ఈ

Tamil Nadu: పటాకుల దుకాణంలో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి

డిండిగల్ : తమిళనాడు(Tamilnadu)లోని డిండిగల్‌(Dindigul)లో విషాదకరమైన ఘటన జరిగింది. ఓ పటాకుల దుకాణం( firecracker shop)లో అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. దుకాణంలోని సామాను మొత్తం కాలిబూడిదయ్యింది. షాప్ ముందున్న ఓ కారు, బైక్ పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని స్థానిక అధికారులు వెల్లడించారు. డిండిగల్ కాలెక్టర్ కార్యాలయం(collector Office) ఎదురుగా ఉండే పటాకుల దుకాణంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతామని డిండిగల్ ఎస్‌పీ వీ.బాస్కరన్(SP. Baskaran) తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.


Updated Date - 2022-06-22T23:38:17+05:30 IST