తమిళనాడులో కరోనా విలయతాండవం.. లక్ష దాటిన కేసులు..

ABN , First Publish Date - 2020-07-04T01:10:33+05:30 IST

తమిళనాడులో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే ఇక్కడ...

తమిళనాడులో కరోనా విలయతాండవం.. లక్ష దాటిన కేసులు..

చెన్నై: తమిళనాడులో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే ఇక్కడ 4,329 మంది కరోనా బారిన పడినట్టు గుర్తించారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కొవిడ్-19 బాధితుల సంఖ్య లక్ష మార్కును దాటింది. ఇవాళ మరో 64 మంది మృతి చెందడంతో కరోనా మరణాల సంఖ్య 1,385కు పెరిగింది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,02,721కు చేరినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కాగా 4,329 కొత్త కేసుల్లో ఒక్క చెన్నై నగరం నుంచే 2,082 మందికి ఇన్ఫెక్షన్ సోకినట్టు తేలింది. శుక్రవారం వివిధ ఆస్పత్రుల నుంచి 2,357 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు తమిళనాట కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 58,378కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 42,955 యాక్టివ్ కేసులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-07-04T01:10:33+05:30 IST