తమిళనాడులో సీన్ రివర్స్.. డీఎంకేకు విజయం ఏకపక్షం అనుకుంటే..

ABN , First Publish Date - 2021-05-02T16:14:29+05:30 IST

తమిళనాడు 234 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అనుకుంటే. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం సీన్ రివర్స్ అవుతున్నట్లు అనిపిస్తోంది.

తమిళనాడులో సీన్ రివర్స్.. డీఎంకేకు విజయం ఏకపక్షం అనుకుంటే..

చెన్నై: తమిళనాడు 234 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అనుకుంటే. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం సీన్ రివర్స్ అవుతున్నట్లు అనిపిస్తోంది. డీఎంకేకు పళనిస్వామి ఆధ్వర్యంలోనే అన్నాడీఎంకే గట్టిపోటీ ఇస్తోంది. రెండు పార్టీల మధ్య పోరు ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఉదయం 10.45 గంటల వరకు వచ్చిన సమాచారం ప్రకారం డీఎంకే కూటమి 94 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే.. అన్నాడీఎంకే 75 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతానికి ఇరు పార్టీల మధ్య స్వల్ప ఆధిక్యం మాత్రమే ఉంది. అటు కోయంబత్తూర్ సౌత్‌లో పోటీ చేస్తున్న మక్కళ్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు.    



Updated Date - 2021-05-02T16:14:29+05:30 IST