సీఎం కేసీఆర్‌ను కలిసిన స్టార్ హీరో
ABN , First Publish Date - 2022-05-19T01:46:17+05:30 IST
సీఎం కేసీఆర్‌ను తమిళ హీరో (Hero) విజయ్ (ViJay) కలిశారు. హైదరాబాద్ (Hyderabad) వచ్చిన విజయ్...
హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ను తమిళ హీరో (Hero) విజయ్ (ViJay) కలిశారు. హైదరాబాద్ (Hyderabad) వచ్చిన విజయ్.. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ (Kcr)ను మర్యాదపూర్వకంగా కలిశారు. హీరో విజయ్‌తో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamsi Paidipally) కూడా ఉన్నారు. వీరిని ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ (Joginipally Santosh Kumar).. సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా హీరో విజయ్ను సీఎం కేసీఆర్ శాలువాతో సన్మానించారు. విజయ్ను కేసీఆర్ అప్యాయంగా పలకరించి సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం హీరో విజయ్ ద్విభాషా చిత్రం చేస్తున్నారు. ఈ మూవీకి దిల్ రాజు (Dilraju) నిర్మాతగా వ్యవహరిస్తుండగా దర్శకుడు వంశీపైడిపల్లి తెరకెక్కిస్తున్నారు. సినిమాను తమిళంతో పాటు తెలుగులో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా నేపథ్యంలోనే హీరో విజయ్ హైదరాబాద్ వచ్చారు.
కాగా హీరో విజయ్ సినిమాలు తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలోనూ విడుదలవుతున్నాయి. ‘అదిరింది’, ‘విజిల్’, ‘తుపాకీ’, ‘మాస్టర్’, ‘బీస్ట్’ సినిమాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. మంచి ఆదరణ పొందాయి. హీరో విజయ్‌కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.