టమాటా ధరలకు రెక్కలు

ABN , First Publish Date - 2022-05-07T05:30:00+05:30 IST

ఎండలకు పోటీగా టమాటా ధరలు మండుతున్నాయి. మొన్నటి వరకు ధర లేక పండించిన పంటను రైతులు పొలాల్లోనే వదిలేశారు. ప్రస్తుతం వినియోగదారులు కొనుగోలు చేయడానికి జంకుతున్నారు. నారాయణఖేడ్‌ మార్కెట్‌లో శనివారం కిలో టమాటా రూ.40కు విక్రయించారు. నాలుగైదు రోజుల క్రితం వరకు మార్కెట్‌లో కిలో టమాటా రూ.10కి విక్రయించారు. ఇంతలోనే ధర నాలుగింతలు పెరిగింది. హోల్‌సేల్‌గా 25 కేజీల టమాటా బాక్సు రూ.900 వరకు విక్రయిస్తుండగా, చిల్లరగా కిలో రూ.40 చొప్పున విక్రయిస్తున్నారు.

టమాటా ధరలకు రెక్కలు

మళ్లీ పెరిగిన ధరలు

కిలో రూ. 40 నుంచి రూ. 50 వరకు విక్రయం


నారాయణఖేడ్‌, మే 7: ఎండలకు  పోటీగా టమాటా ధరలు మండుతున్నాయి. మొన్నటి వరకు ధర లేక పండించిన పంటను రైతులు పొలాల్లోనే వదిలేశారు. ప్రస్తుతం వినియోగదారులు కొనుగోలు చేయడానికి జంకుతున్నారు. నారాయణఖేడ్‌ మార్కెట్‌లో శనివారం కిలో టమాటా రూ.40కు విక్రయించారు. నాలుగైదు రోజుల క్రితం వరకు మార్కెట్‌లో కిలో టమాటా రూ.10కి విక్రయించారు. ఇంతలోనే ధర నాలుగింతలు పెరిగింది. హోల్‌సేల్‌గా 25 కేజీల టమాటా బాక్సు రూ.900 వరకు విక్రయిస్తుండగా, చిల్లరగా కిలో రూ.40 చొప్పున విక్రయిస్తున్నారు. ఎండల తీవ్రతకు దిగుబడి తగ్గిపోవడం, పండిన పంటను తెంపి మార్కెట్‌కు తరలించేందుకు కూలీల సమస్య ఏర్పడటంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతులు లేపోవడమూ ధరలపై ప్రభావం చూపుతున్నదని వ్యాపారులు పేర్కొంటున్నారు. సాధారణంగా టమాటాను మదనపల్లి నుంచి దిగుమతి చేసుకుంటారు. కానీ అక్కడ కూడా పంట ఆశించిన స్థాయిలో లేకపోవడంతో దిగుమతులు తగ్గిపోయాయి. ప్రతీ వంటలో తప్పనిసరిగా ఉపయోగించే టమాటా ధరలు పెరుగుతుండడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు.

Read more