Oct 20 2021 @ 08:12AM

‘తమసోమ జ్యోతిర్గమయ’: ఆకట్టుకుంటున్న ట్రైలర్

విజయ్ కుమార్ బడుగు ద‌ర్శ‌క‌త్వంలో ఆనంద్ రాజ్ బేతి, శ్రావణి సెట్టి, జనార్దన్, ఆర్కే నటించిన తాజా చిత్రం ‘తమసోమ జ్యోతిర్గమయ’. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకోవడమే కాకుండా పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలో ..ట్రైలర్‌ని చూస్తుంటే 'వేదం' సినిమా గుర్తొస్తుందని దర్శకుడు క్రిష్ అన్నారు. అంతేకాదు ఈ ట్రైలర్‌లో ‘ఊరుని నేను చూస్తున్నట్టు లేదు, ఊరే నన్ను చూస్తున్నట్టు’ ఉందని చెప్పే మాట మనలో కొత్త ఆలోచనల్ని కలిగిస్తుందని చిత్ర దర్శకుడిని ప్రశంసించారు. ఇక ఈ సినిమాను గుణాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో విమల్ క్రియేషన్స్ బ్యానర్‌పై త‌డ‌క ర‌మేష్ నిర్మించారు. అక్టోబర్ 29న విడుద‌ల‌ కాబోతోంది. ప్రశాంత్ బిజె సంగీత దర్శకుడు.