Advertisement
Advertisement
Abn logo
Advertisement

చింతపండు చారు

ఇది జీర్ణవ్యవస్థను శుభ్రం చేసి జీర్ణసంబంధ రోగాలు రాకుండా కాపాడుతుంది. విరోచనం గట్టిగా అవుతున్న వారు రసం రోజూ తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు. అన్నంలో కలుపుకొని తినడమే కాకుండా, విడిగా తాగొచ్చు. ఏ కారణం చేతైనా నీరస పడిన వారు ఈ చారును ఆహారంలో ఇవ్వడం వల్ల వెంటనే నీరసం తగ్గుతుంది. 


కావలసినవి: ఒక లీటర్‌ నీళ్లు, పెద్ద ఉసిరికాయంత పరిమాణంలో చింతపండు, పసుపు, ఇంగువ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, బెల్లం, కరివేపాకు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర.


తయారీ విధానం: స్టవ్‌ ఒక పాత్రలో నీళ్లు పెట్టి మరిగిన తరువాత చింతపండు పులుసు, కరివేపాకు వేయాలి. మరికాసేపు మరిగించాలి. తరువాత పసుపు, ఇంగువ వేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి ఒక్కొక్క టీస్పూన్‌ వేయాలి. మరో రెండు నిమిషాలు మరగనివ్వాలి. ఇప్పుడు ఉప్పు, బెల్లం వేసి దింపుకోవాలి. ఈ రసం తాలింపు కోసం పాత్రలో తగినంత నూనె వేసి వేడి అయ్యాక మెంతులు వేసి మాడనివ్వాలి. తరువాత ఎండుమిరపకాయలు, ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటలాడిన తరువాత జీలకర్రవేయాలి. ఈ తాలింపును చారులో కలుపుకోవాలి.

చిక్కుడుకాయ రసంనూడుల్స్‌ సూప్‌ ఉల్లిపాయ సూప్బెండకాయ సూప్‌గుమ్మడికాయ సూప్బీరకాయ సూప్‌సొరకాయ సూప్‌పెస్టో పాస్తా సలాడ్‌ఓట్స్‌- క్యాప్సికమ్‌ సూప్‌క్యారెట్‌ టొమాటో సూప్‌
Advertisement