Abn logo
Mar 8 2021 @ 10:38AM

సూపర్‌స్టార్‌తో మరోసారి మిల్కీబ్యూటీ..!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌తో మిల్కీబ్యూటీ త‌మ‌న్నా మ‌ళ్లీ జోడీ క‌డుతుందా..! అదేంటి? మ‌హేశ్ లేటెస్ట్ మూవీ ‘స‌ర్కారువారిపాట‌’ చిత్రంలో కీర్తిసురేశ్ హీరోయిన్ క‌దా, మ‌ళ్లీ త‌మ‌న్నా ఎక్క‌డ నుంచి.. ఆమె ఏమైనా గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌నుందా? ఇలాంటి సందేహాలు అభిమానుల‌కు రాక‌మాన‌వు. అస‌లు విష‌య‌మేమంటే.. మ‌హేశ్‌, త‌మ‌న్నా క‌లిసి న‌టించేది నిజ‌మేన‌ట‌. అయితే వీరు సిల్వ‌ర్ స్క్రీన్‌పై సంద‌డి చేయ‌డం లేద‌ట‌. ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ కోసం న‌టించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం. 

ఇప్ప‌టికే మ‌హేశ్..ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో తాను న‌టిస్తోన్న 27వ చిత్రం ‘స‌ర్కారువారిపాట‌’ సినిమాకు సంబంధించి రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుని దుబాయ్ నుంచి హైద‌రాబాద్ చేరుకున్న సంగ‌తి తెలిసిందే. నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే గ్యాప్‌లో క‌మిట్ అయిన క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌ను పూర్తి చేయాల‌ని మ‌హేశ్ ప్లాన్ చేసేశాడు. అందులో భాగంగానే ఓ క‌మ‌ర్షియ‌ల్‌యాడ్‌లో త‌మ‌న్నాతో క‌లిసి న‌టిస్తున్నాడు మ‌రి.

Advertisement
Advertisement
Advertisement