Jul 9 2021 @ 17:16PM

వావ్‌ తమన్నా,.. ఏం ఎనర్జీ!

మిల్కీబ్యూటీ తమన్నా నటనలోనే కాదు డాన్స్‌లోనూ పర్ఫెక్ట్‌ అని ఎన్నో సినిమాల ద్వారా నిరూపించారు. అయితే డాన్స్‌లో ఇంకా పర్ఫెక్ట్‌గా ఉండాలంటోందామె. అందుకే క్రమం తప్పకుండా ప్రాక్టీస్‌ చేస్తారట తమన్నా. తాజాగా  ‘కిస్‌ మీ మోర్‌’ అనే పాటకు డాన్స్‌ చేసి దానిని ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో షేర్‌ చేశారు మిల్కీబ్యూటీ. పాట బీట్‌కు తగ్గట్లు వయ్యారంగా నడుము తిప్పుతున్న తమన్నాను చూసి  ‘వావ్‌ తమన్నా,.. ఏం ఎనర్జీ’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఇందులో తమన్నాతోపాటు ఆమె స్నేహితురాలు కూడా ఉన్నారు. సినిమాలే కాకుండా వెబ్‌ సిరీస్‌ల మీద దృష్టిపెట్టారు. తాజాగా ‘మాస్టర్‌ ఛెఫ్‌ పేరుతో ఓ టీవీ షో కూడా చేస్తున్నారు. ‘సీటీమార్‌’ షూటింగ్‌ పూర్తి చేసుకున్న తమన్నా ‘గుర్తుందా.. శీతాకాలం’, ‘మ్యాస్ర్టో’, ‘ఎఫ్‌ 3’ సినిమాల్లో నటిస్తున్నారు.