Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 29 Jan 2022 16:00:15 IST

వరుణ్‌ తేజ్‌కు ఛాలెంజ్‌ విసిరిన మిల్కీబ్యూటీ!

twitter-iconwatsapp-iconfb-icon
వరుణ్‌ తేజ్‌కు ఛాలెంజ్‌ విసిరిన మిల్కీబ్యూటీ!

హీరో వరుణ్‌తేజ్‌కు, హీరోయిన్‌ శాయి మంజ్రేకర్‌కు మిల్కీబ్యూటీ తమన్నా సవాల్‌ విసిరారు. ‘గని’ చిత్రంలో ‘కొడితే’ పాటకు డాన్స్‌ ఫ్లోర్‌లో స్టెప్పులేస్తూ ‘ఇక మీ వంతు’ అంటూ ఛాలెంజ్‌ చేశారు. అసలు విషయంలోకి వెళ్తే వరుణ్‌తేజ్‌ హీరోగా నటించిన ‘గని’ చిత్రంలో తమన్నా.. ‘కొడితే..’ అంటూ సాగే ప్రత్యేక గీతంలో నటించారు. సంక్రాంతి సందర్భంగా ఈ పాటను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. అయుతే తాజాగా తమన్నా ఈ పాటకు డాన్స్‌ ఫ్లోర్‌లో కొత్త తరహా స్టెప్స్‌ వేస్తూ ఓ వీడియో ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ‘‘డాన్స్‌లో మంచి అవుట్‌ రావాలంటే మరిన్ని అవకాశాలు తీసుకోండి’. నా వంతుగా ‘కొడితే’ బీట్‌కు డాన్స్‌ చేస్తున్నాను. ఇక మీవంతు అని వరుణ్‌తేజ్‌కు, శాయి మంజ్రేకర్‌ తమన్నా సవాల్‌ విసిరారు. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్‌ డ్రామాకు కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. మార్చిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 




Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement