Abn logo
Jan 16 2021 @ 09:08AM

చీటింగ్ చేస్తున్న తమన్నా!

ఇటీవలి కాలంలో సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. తమకు సంబంధించిన వ్యక్తిగత, వృత్తిగత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా తనకు సంబంధించిన చాలా విషయాలను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది.


తాజాగా మిల్కీ బ్యూటీ తన చీటింగ్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. డైటింగ్‌కు స్వస్తి చెప్పి ఇష్టమైనవన్నీ తింటున్నట్టు తెలిపింది. ఆ ఫొటోలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తమన్నా ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ సరసన `సిటీమార్` సినిమాలో నటిస్తోంది. అలాగే `అంధాధున్` తెలుగు రీమేక్‌లో కీలక పాత్ర చేస్తోంది. 


Advertisement
Advertisement
Advertisement