వారికి తమన్నా లీగల్ నోటీసులు..!

సౌత్ స్టార్ హీరోయిన్ తమన్నా 'మాస్టర్ ఛెఫ్' నిర్వాహకులకి లీగల్ నోటీసులు పంపి షాకిచ్చినట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే..తమన్నా భాటియా హోస్ట్‌గా ప్రముఖ టీవీ ఛానల్ జెమినీలో 'మాస్టర్ ఛెఫ్' అనే కుకరీ షో ప్రసారమవుతోంది. ప్రోమోలతో బాగా హైప్ వచ్చిన ఈ షోకి ప్రారంభంలో మంచి రేటింగ్ నమోదైంది. అయితే రాను రాను షో రేటింగ్ బాగా పడిపోవడంతో తమన్నా వల్లే షో డల్ అయిందని భావించిన నిర్వాహకులు ఆమె స్థానంలో ప్రముఖ యాంకర్ అనసూయను తీసుకున్నారట. దాంతో తమన్నాను తొలగించడంపై అసంతృతి చెంది..వెంటనే తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాల్సిందిగా ప్రొడక్షన్ హౌజ్‌కు లీగల్ నోటీసులు పంపించినట్టు తెలుస్తోంది. ఇక తమన్నా సినిమాల విషయానికొస్తే.. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'భోళా శంకర్' సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో జతకట్టబోతోంది. అలాగే 'ఎఫ్ 3'లో వెంకీకి జంటగా నటిస్తోంది. 

Advertisement