తామా ఆధ్వర్యంలో పర్వతారోహణ (హైకింగ్) యాత్ర

ABN , First Publish Date - 2020-03-04T22:37:58+05:30 IST

తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా(టామా) ఆదివారం తొలిసారిగా పర్వతారోహణ(హైకింగ్) యాత్రను నిర్వహించింది

తామా ఆధ్వర్యంలో పర్వతారోహణ (హైకింగ్) యాత్ర

అట్లాంటా: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా(టామా) ఆదివారం తొలిసారిగా పర్వతారోహణ(హైకింగ్) యాత్రను నిర్వహించింది. ఆరోగ్యం, శారీరక శ్రమ, వ్యాయామంపై అవగాహన పెంచడం ఈ క్రొత్త ప్రయత్నం యొక్క ముఖ్యోద్దేశమని తామా సభ్యులు తెలిపారు. తామా స్పోర్ట్స్ అండ్ యూత్ సెక్రటరీ రమేష్ వెన్నలకంటి స్వాగతోపన్యాసంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. జార్జియాలోని సానీ పర్వతం వద్ద ఉదయం 7:30 గంటలకు ప్రారంభమైన పర్వతారోహణ 10 గంటలకు ముగిసింది. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా సభ్యులు పాల్గొనగా.. మొదటగా నమోదు చేసుకున్న 50 మందికి తామా వారు ఏకో ఫ్రెండ్లీ పునర్వినియోగ నీటి సీసాలను పంపిణీ చేశారు. చిన్నవారు, పెద్దవారు, మొదటి సారి పర్వతారోహణ చేసేవారు, నిపుణులు అందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషమని తామా సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. చాలా మంది తమ కుటుంబాలతో, స్నేహితులతో విచ్చేసి సరదాగా నడవటం కనిపించిందని.. ఈ రకమైన యాత్ర ఈ తరానికి, భవిష్యత్ తరాలకు అన్ని కోణాల్లో ఉపయోగపడుతుందన్నారు. 


సర్వజన ప్రయోజనకర కార్యక్రమాల నిర్వహణలో తామా ఎప్పుడూ ముందు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. కాగా.. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ తామా వారు అల్పాహారం, తేనీరు అందించారు. తామా వారు ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టడాన్ని అందరూ ప్రశంసించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావటానికి కృషి చేసిన తామా నాయకత్వం భరత్ మద్దినేని, భరత్ అవిర్నేని, హితేష్ వడ్లముడి, రూపేంద్ర వేములపల్లి, శుశృత్ రెడ్డి బుసిరెడ్డి, రాజశేఖర్ చుండురి, శ్రీనివాస్ ఉప్పు, శివదేవభక్తుని, నాగేష్ దొడ్డాక, వాలంటీర్లు రాజేష్ జంపాల, అంజయ్య చౌదరి లావు, హేమంత్ వర్మ పెన్మెట్స, మురళి బొడ్డు, అనురాగ్ బండ్ల, ఉపేంద్ర నర్రా, వినయ్ మద్దినేని, నరేంద్ర సూరపనేని, మోనిష్ జంపాల, తనీష్ జంపాలతో పాటు విచ్చేసిన అందరికీ రమేష్ కృతజ్ఞతలు తెలిపి దిగ్విజయంగా ముగించారు. 

Updated Date - 2020-03-04T22:37:58+05:30 IST