హిందీ హీరోయిన్ కరీనా కపూర్ రెండోసారి తల్లి కానున్నారు. ప్రస్తుతం ఆమె గర్భవతి. త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారు. భర్త సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ విషయం వెల్లడించారు. ‘‘మా కుటుంబంలోకి మరో కొత్త వ్యక్తి రాబోతున్నారని చెప్పడానికి మేం చాలా సంతోషిస్తున్నాం. ప్రేమాభిమానాలు, మద్దతు ఎల్లప్పుడూ అందించే మా శ్రేయోభిలాషులు అందరికీ ధన్యవాదాలు’’ అని సైఫ్, కరీనా జంట పేర్కొంది. వీళ్లకు మూడేళ్ల కుమారుడు తైమూర్ అలీ ఖాన్ ఉన్న సంగతి తెలిసిందే. మొదటి భార్య, నటి అమృత ద్వారా సైఫ్‌కి ఇద్దరు పిల్లలు... కుమార్తె సారా, కుమారుడు ఇబ్రహీం ఉన్నారు.