Afghanistan: అఫ్ఘాన్ మీడియాపై తాలిబన్ల నిషేధం

ABN , First Publish Date - 2021-09-07T16:09:57+05:30 IST

అఫ్ఘానిస్థాన్ దేశంలో అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు తాజాగా మీడియాపై కూడా నిషేధం విధించారు....

Afghanistan: అఫ్ఘాన్ మీడియాపై తాలిబన్ల నిషేధం

కాబూల్ (అఫ్ఘానిస్థాన్): అఫ్ఘానిస్థాన్ దేశంలో అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు తాజాగా మీడియాపై కూడా నిషేధం విధించారు. తాలిబన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు కోసం పిలుపునిచ్చిన పంజ్‌షీర్ నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ (ఎన్‌ఆర్‌ఎఫ్) నాయకుడు అహ్మద్ మసౌద్ సందేశాన్ని ప్రసారం చేయకుండా అఫ్ఘాన్ వార్తా మాధ్యమాలను తాలిబన్లు నిషేధించారు.అఫ్ఘాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, హై కౌన్సిల్ ఫర్ నేషనల్  మాజీ ఛైర్మన్ అబ్దుల్లా అబ్దుల్లాలు తోటి పౌరులతో కలవకుండా తాలిబన్లు అడ్డుకున్నారు.అహ్మద్ మసౌద్ సోమవారం తాలిబన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు కోసం పిలుపునిచ్చారు. ‘‘మీరు ఎక్కడ ఉన్నా మన దేశ గౌరవం, స్వేచ్ఛ, శ్రేయస్సు కోసం జాతీయ తిరుగుబాటును ప్రారంభించాలని నేను మిమ్మల్ని పిలుస్తున్నాను’’ అని నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ కమాండర్ అహ్మద్ మసౌద్ మీడియాకు పంపిన ఆడియో సందేశంలో కోరారు.తిరుగుబాటుపై పంజ్ షీర్, తాలిబన్ల మధ్య పరస్పర విరుద్ధమైన నివేదికలు వెలువడ్డాయి.తాలిబన్లు  పంజ్ షీర్ ప్రావిన్స్‌ని విడిచిపెడితే తాను పోరాటాన్ని నిలిపివేసి చర్చలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నానని మసౌద్ చెప్పారు.


Updated Date - 2021-09-07T16:09:57+05:30 IST