Talibans నుంచి మరో హుకుం.. టీవీ ‘మహిళా ప్రజెంటర్లు’ తప్పనిసరిగా...

ABN , First Publish Date - 2022-05-20T01:31:57+05:30 IST

కాబూల్ : ఆప్ఘనిస్తాన్‌లో పాలన కొనసాగిస్తున్న తాలిబన్లు ( Talibans) మరో అనాగరిక ఆదేశాన్ని జారీ చేశారు. టీవీ చానళ్ల ‘మహిళా ప్రజెంటర్లు’ తమ ముఖాన్ని కనిపించనివ్వొద్దని, ముఖాన్ని తప్పనిసరిగా కవర్ చేసుకోవాలని హుకుం జారీ చేశారు.

Talibans నుంచి మరో హుకుం.. టీవీ ‘మహిళా ప్రజెంటర్లు’ తప్పనిసరిగా...

కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్‌లో పాలన కొనసాగిస్తున్న తాలిబన్లు ( Talibans) మరో అనాగరిక ఆదేశాన్ని జారీ చేశారు. టీవీ చానళ్ల ‘మహిళా ప్రజెంటర్లు’ తమ ముఖాన్ని కనిపించనివ్వొద్దని, ముఖాన్ని తప్పనిసరిగా కవర్ చేసుకోవాలని హుకుం జారీ చేశారు. స్థానిక టీవీ కేంద్రాల్లో పనిచేస్తున్నవారంతా ఈ నిబంధనను పాటించాలని, ఇందుకు టెలివిజన్ బ్రాడ్‌కాస్టర్లదే బాధ్యత అని హెచ్చరించారు. మీడియా అధికారులతో భేటీ అయ్యామని, తమ సలహాను వారు సంతోషంగా స్వీకరించారని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి అకీఫ్ మహజర్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అఫ్ఘనిస్తాన్ ప్రజలు సాదరంగా ఆహ్వానిస్తారని విశ్వాసం వ్యక్తం చేశాడు. మహిళ టీవీ ప్రజెంటర్లకు మే 21 డెడ్‌లైన్‌గా ప్రకటించాడు. అయితే ప్రభుత్వ ఆదేశాలను ఓ సలహాగా అభివర్ణించాడు. ఈ సలహాను పాటించకపోతే ఏం జరుగుతుందని ప్రశ్నించగా అతడు ఎలాంటి సమాధానం చెప్పలేదు. కాగా కొవిడ్ సమయంలో ఉపయోగించిన ఫేస్‌మాస్క్‌ లాంటి వాటిని కూడా వాడొచ్చని ఓ ఉచిత సలహా ఇచ్చాడు.


కాగా మత సంబంధ కారణాలతో ఆఫ్ఘనిస్తాన్‌లో అత్యధిక మహిళలు హెడ్‌కార్ఫ్‌ను ధరిస్తారు. అయితే కాబూల్ లాంటి అర్బర్ ప్రాంతాల్లో మాత్రం మహిళలు ముఖాన్ని కవర్ చేసుకోకుండానే తమ కార్యకలాపాలను కొనసాగిస్తారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తమ ముఖాలను కనిపించనివ్వకూడదంటూ ఆదేశాలు వెలువడిన రోజుల వ్యవధిలో టీవీ మహిళా ప్రజెంటర్లపై ఆంక్షలు విధించడం గమనార్హం. ఈ నిబంధనలపై అటు ఆఫ్ఘనిస్తాన్‌తోపాటు అంతర్జాతీయ సమాజం నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 

Updated Date - 2022-05-20T01:31:57+05:30 IST