కాందహార్ (అప్ఘానిస్థాన్): అప్ఘానిస్థాన్ దేశంలో తాలిబన్ల పాలనలో కాందహార్ నగరంలోని అరఘండాబ్ నది ఒడ్డున అఫ్ఘాన్ యువకులు ఆటపాటలతో గడపడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాందహార్ నగరంలో ఏడుగురు యువ తాలిబన్లు దేశభక్తి గల అప్ఘాన్ పాటను పాడుతూ నృత్యం చేయడం సంచలనం రేపింది. తాలిబన్లు అఫ్ఘాన్ శైలిలో చేతులు చాపుతూ పక్కపక్కనే కదులుతూ డాన్స్ చేశారు. 1996 వసంవత్సరంలో తాలిబన్లు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వారు షరియా చట్టం ప్రకారం అన్ని రకాల వినోద కార్యక్రమాలను నిషేధించారు.
అప్ఘాన్ తాలిబన్ల వశంతో మహిళలు భయపడుతున్నారు. తాలిబన్ సభ్యులు కాందహార్‌లోని అరఘండాబ్ నది ఒడ్డున సంప్రదాయ నృత్యం చేశారు. తాలిబన్లు మతపరమైన సంగీతపాటలు వింటారు. అప్ఘాన్ సంప్రదాయ పాట మన దేశానికి చెందినదని దాన్ని పాడుతూ నృత్యం చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తాలిబన్ నర్తకి చెప్పారు.