తాలిబన్ నేత ముల్లా బరాదర్ దగ్గర పాకిస్తాన్ పాస్‌పోర్టు?

ABN , First Publish Date - 2021-09-06T12:29:42+05:30 IST

తాలిబన్ ఇస్లామిస్ట్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు ముల్లా బరాదర్...

తాలిబన్ నేత ముల్లా బరాదర్ దగ్గర పాకిస్తాన్ పాస్‌పోర్టు?

కాబుల్: తాలిబన్ ఇస్లామిస్ట్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు ముల్లా బరాదర్ నాయకత్వంలో అఫ్ఘానిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతున్నదనే వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో అతని పాకిస్తానీ పాస్‌పోర్ట్ ఫోటో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. దీంతో పాక్, అఫ్ఘానిస్తాన్‌ల సంబంధాలు మరోమారు బహిర్గతమయ్యాయి. ముల్లా బరాదర్ దగ్గర పాకిస్తాన్ పాస్‌పోర్ట్ ఉన్నదని గతంలోనే వార్తలు వచ్చాయి. 


ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఖామా ప్రెస్ గతంలోనే ముల్లా బరాదర్... పాకిస్తాన్ జాతీయ గుర్తింపు కార్డును కూడా కలిగి ఉన్నాడని పేర్కొంది. అఫ్ఘానిస్తాన్ నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ మాజీ అధికారి... ముహమ్మద్ ఆరిఫ్ అఘా అనే కల్పిత పేరుతో ముల్లా బరాదర్‌కు ఈ పత్రాలను జారీ చేసినట్లు సమాచారం. ఈ పత్రాలను జూలై 7, 2014 న పాకిస్థాన్‌లోని కరాచీలో ముల్లా బరాదర్‌కు జారీ చేసినట్లు ఖామా ప్రెస్ పేర్కొంది. అయితే ముల్లా బరాదర్... ముహమ్మద్ ఆరిఫ్ అఘా ఒకరు కాదని...సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోతో సరిపోలడం లేదని, తాలిబన్లు ఈ వాదనను తిరస్కరించారని కూడా ఖామా ప్రెస్ తెలిపింది.

Updated Date - 2021-09-06T12:29:42+05:30 IST