తాలిబన్ల దుశ్చర్య.. జైళ్ల నుంచి 1000 మంది నేరస్థుల విడుదల!

ABN , First Publish Date - 2021-08-13T02:22:02+05:30 IST

అఫ్గానిస్థాన్‌లో కీలక ప్రాంతాలను ఒక్కొక్కటిగా తమ గుప్పెట్లోకి తెచ్చుకుంటున్న తాలిబన్లు..అక్కడి జైళ్లలో ఉన్న నేరస్థులను కూడా విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది.

తాలిబన్ల దుశ్చర్య.. జైళ్ల నుంచి 1000 మంది నేరస్థుల విడుదల!

న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్‌లో కీలక ప్రాంతాలను ఒక్కొక్కటిగా తమ గుప్పెట్లోకి తెచ్చుకుంటున్న తాలిబన్లు..అక్కడి జైళ్లలో ఉన్న నేరస్థులను కూడా విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. తమ ఆధీనంలోని ఆరు నగరాల్లోగల జైళ్ల నుంచి వెయ్యి మంది నేరస్థులను తాలిబన్లు తాజాగా విడుదల చేసినట్టు సమాచారం. ఇలా విడుదలైన వారిలో స్మగ్లింగ్, కిడ్నాప్, దోపిడీ వంటి క్రిమినల్ నేరాలకు పాల్పడిన వారు ఉన్నారట. అయితే..తాలిబన్లను లొంగదీసుకున్న అనంతరం.. తాము ఈ నేరస్థులందరినీ మళ్లీ జైళ్లలో వేస్తామని అఫ్గాన్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు హామీ ఇచ్చింది.  

Updated Date - 2021-08-13T02:22:02+05:30 IST