అమృల్లా సలే వీడియోను రికార్డును చేసిన చోటే.. తాలిబన్ ఫైటర్ పోజు, సోషల్ మీడియాలో వైరల్

ABN , First Publish Date - 2021-09-11T23:08:17+05:30 IST

బుక్‌షెల్ఫ్ ముందు తుపాకితో ఫొటో దిగిన తాలిబన్ ఫైటర్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం.. అదే ఫొటో ముందు

అమృల్లా సలే వీడియోను రికార్డును చేసిన చోటే.. తాలిబన్ ఫైటర్ పోజు, సోషల్ మీడియాలో వైరల్

పంజ్‌షీర్: బుక్‌షెల్ఫ్ ముందు తుపాకితో కూర్చున్న తాలిబన్ ఫైటర్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం.. అదే బుక్‌షెల్ఫ్ ముందు అంతకముందు ఆఫ్ఘనిస్థాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమృల్లా సలే ఓ వీడియోను రికార్డు చేయడమే. పంజ్‌షీర్ వ్యాలీలో జరిగిన ఘర్షణల్లో అమృల్లా సలే సోదరుడు రోహుల్లా సలే‌ను తాలిబన్లు హతమార్చిన తర్వాత ఈ ఫొటో వెలుగులోకి వచ్చింది. 


తాలిబన్ అనుకూల ట్విట్టర్ ఖాతాల్లో ఈ ఫొటో విపరీతంగా తిరుగుతోంది. తుపాకి పట్టుకున్న తాలిబన్ బుక్‌షెల్ఫ్ ముందు దర్జాగా కూర్చున్నట్టుగా ఆ ఫొటో ఉంది. తాలిబన్లతో జరిగిన ఘర్షణల్లో రోహుల్లా సలే మరణించినట్టు పలు నివేదికలు ధ్రువీకరించాయి కూడా. కాగా, ప్రస్తుతం తాలిబన్ ఫొటో దిగిన ప్రాంతం నుంచే ఇటీవల ఓ వీడియో సందేశాన్ని పంపిన అమృల్లా సలే.. తాను దేశాన్ని వీడిపోబోనని స్పష్టం చేశారు. పంజ్‌షీర్‌లో తాలిబన్లను ఎదురొడ్డుతామని తెలిపారు. 


పంజ్‌షీర్ ప్రావిన్స్‌ను తాము స్వాధీనం చేసుకున్నట్టు తాలిబన్లు ప్రకటించిన తర్వాత అమృల్లా సలే దేశాన్ని విడిచిపెట్టి పారిపోయినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని అన్నారు. అంతేకాదు,  పంజ్‌షీర్‌ను స్వాధీనం చేసుకున్నామన్న తాలిబన్ల ప్రకటనను నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ (ఎన్ఆర్ఎఫ్) ఫైటర్లు కూడా ఖండించారు.   

Updated Date - 2021-09-11T23:08:17+05:30 IST