తాలిబన్ల కీలక ప్రకటన.. అఫ్ఘానిస్థాన్‌ ఇకపై..

ABN , First Publish Date - 2021-08-19T22:25:50+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌ ఇకపై ఇస్లామిక్ ఎమిరేట్ అని తాలిబన్లు తాజాగా ప్రకటించారు.

తాలిబన్ల కీలక ప్రకటన.. అఫ్ఘానిస్థాన్‌ ఇకపై..

కాబూల్: అఫ్ఘానిస్థాన్‌ ఇకపై ఇస్లామిక్ ఎమిరేట్ అని తాలిబన్లు తాజాగా ప్రకటించారు. నేడు అఫ్ఘానిస్థాన్‌లో 102వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో తాలిబన్లు ఈ ప్రకటన విడుదల చేశారు. బ్రిటిష్ పాలన అంతానికి గుర్తుగా అఫ్ఘాన్ ప్రజలు ఆగస్టు 19న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటారు. తాలిబన్లు మళ్లీ అధికారంలోకి రావడంతో ప్రస్తుతం అక్కడ భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. 1996-2001 మధ్యకాలంలో తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు వారు దేశాన్ని ఇస్లామిక్ ఎమిరేట్‌ ఆఫ్ అఫ్ఘానిస్థాన్‌గా అని పిలిచేవారు. 2001లో అక్కడ కాలుపెట్టిన అమెరికా దళాలు.. తాలిబన్ల ఆట కట్టించి, పేరులోంచి ‘ఇస్లామిక్ అమిరేట్’ అనే పదాన్ని తొలగించాయి. ఇటీవల అఫ్ఘానిస్థాన్ మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో వారు మునుపటి పేరును పునరుద్ధరించారు. 

Updated Date - 2021-08-19T22:25:50+05:30 IST