Kabul: ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన తాలిబన్లు

ABN , First Publish Date - 2021-09-09T17:38:34+05:30 IST

అఫ్ఘానిస్థాన్ దేశ రాజధాని నగరమైన కాబూల్ లో నిరసనల నేపథ్యంలో తాలిబన్లు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు...

Kabul: ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన తాలిబన్లు

కాబూల్ : అఫ్ఘానిస్థాన్ దేశ రాజధాని నగరమైన కాబూల్ లో నిరసనల నేపథ్యంలో తాలిబన్లు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ కాబూల్ లో చేస్తున్న జన సమీకరణను అరికట్టేందుకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. నిరసనల సందేశాలు సోషల్ మీడియా ద్వారా ప్రసారం అవుతాయనే భయంతో తాలిబన్ ఇంటెలిజెన్స్ ఇంటర్నెట్ సేవల బ్లాక్ కు ఆదేశించినట్లు సమాచారం. తాలిబన్ల పాలనకు వ్యతిరేకంగా వందలాదిమంది మహిళలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ఆగస్టు 15 న కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇటీవల తాలిబాన్ నాయకులు దేశంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.నిరసనకారులు నిరసనకు తాలిబాన్ న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది.


Updated Date - 2021-09-09T17:38:34+05:30 IST