న్యూఢిల్లీ : తాలిబాన్లకు కొరకరాని కొయ్యలా మారిన పంజషీర్ ప్రాంతం విషయంలో తాలిబాన్లు సంచలన ప్రకటన చేశారు. పంజషీర్‌లోని గవర్నర్ కార్యాలయాన్ని తాము ఆక్రమించుకున్నామని తాలిబాన్లు సంచలన ప్రకటన చేశారు. కొన్ని నివేదికల ప్రకారం తాలిబాన్లు పంజషీర్ ప్రావిన్స్ రాజధాని బజారక్‌లోకి ప్రవేశించి, అక్కడి గవర్నర్ కార్యాలయన్ని ముట్టడించామని తాలిబాన్ ప్రతినిధులు ప్రకటించారు. ఆఫ్గనిస్తాన్‌ను పరిపూర్ణంగా ఆక్రమించుకోవాలని చూస్తున్న తాలిబాన్లకు పంజషీర్ ప్రాంతం సవాల్ విసురుతోంది. ఈ ప్రాంత వాసుల నుంచి తాలిబాన్లకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఆ ప్రాంతంలోని లోయల్లో తాలిబాన్లు చిక్కుకుంటే, లోయ పై నుంచి పంజషీర్ యోధులు దాడులు చేస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో తాలిబాన్ల ప్రటకనకు ప్రాధాన్యం ఏర్పడింది.