మరణ వార్తల నేపథ్యంలో పబ్లిక్ ముందుకు వచ్చిన తాలిబన్ చీఫ్

ABN , First Publish Date - 2021-10-31T23:35:48+05:30 IST

2016 నుంచి తాలిబన్‌ సంస్థకు సైనికంగా, రాజకీయంగా, మతపరంగా అధినేతగా ఉంటూ వస్తున్న హైమతుల్లా బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. హైమతుల్లాకి పబ్లిక్‌లో కనిపించాలని ఉండదని, అందుకే ఆయన బయటికి పెద్దగా రారని గతంలో..

మరణ వార్తల నేపథ్యంలో పబ్లిక్ ముందుకు వచ్చిన తాలిబన్ చీఫ్

కాబూల్: తాలిబన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుండ్‌జాదా చనిపోయాడంటూ కొంత కాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి. కాగా, ఈ వార్తలను తోసిపుచ్చుతూ మొదటిసారిగా పబ్లిక్ ముందుకు హైబతుల్లా వచ్చారంటూ తాలిబన్లు ప్రకటించారు. కాందహార్‌లోని జామియా దారుల్ అలూమ్ హకీమియా అనే ఇస్లామిస్ట్ పాఠశాలను హైబతుల్లా ఆదివారం సందర్శించారని, అక్కడ ప్రజలకు ఆయన కనిపించారని ఓ అంతర్జాతీయ మీడియాకు తాలిబన్ తెలిపింది. ఆగస్టులో అఫ్ఘాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న కొద్ది రోజుల అనంతరమే హైబతుల్లా చనిపోయాడంటూ రూమర్లు ప్రారంభమయ్యాయి. అయితే ఈ వార్తల్ని తాలిబన్లు ఖండిస్తూ వచ్చారు.


2016 నుంచి తాలిబన్‌ సంస్థకు సైనికంగా, రాజకీయంగా, మతపరంగా అధినేతగా ఉంటూ వస్తున్న హైబతుల్లా బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. హైబతుల్లాకి పబ్లిక్‌లో కనిపించాలని ఉండదని, అందుకే ఆయన బయటికి పెద్దగా రారని గతంలో అనేకసార్లు తాలిబన్ సంస్థ చెప్పుకొచ్చింది. తాలిబన్ ట్విట్టర్‌ ఖాతాలో ఒక్కసారి హైబతుల్లా ఫొటోను విడుదల చేశారు. అయితే ఆ ఫొటో ఎప్పుడు తీసిందనేదానిపై పెద్దగా క్లారిటీ రాలేదు.

Updated Date - 2021-10-31T23:35:48+05:30 IST