డబ్బులు దండగట.. తాలిబన్ల ప్రమాణ స్వీకారం కేన్సిల్!

ABN , First Publish Date - 2021-09-12T00:51:34+05:30 IST

మంగళవారం మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు నేడు కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రకటించారు. మధ్యంతర ప్రభుత్వంలో పలువురు

డబ్బులు దండగట.. తాలిబన్ల ప్రమాణ స్వీకారం కేన్సిల్!

కాబూల్: తాలిబన్లు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. డబ్బు, వనరుల వృథాను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మంగళవారం మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు నేడు కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రకటించారు.


మధ్యంతర ప్రభుత్వంలో పలువురు తాలిబన్ నేతలకు కీలక పదవులు కట్టబెట్టారు. నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార వేడుకకు రష్యా, ఇరాన్, చైనా, ఖతర్, పాకిస్థాన్, ప్రభుత్వాలకు ఆహ్వానాలు కూడా పంపారు. 9/11 అమెరికాపై ఉగ్రదాడిని గుర్తు చేస్తుందని, కాబట్టి దానికి హాజరు కాబోమని ఖతర్‌కు రష్యా తెలిపింది. 


‘అమానవీయంగా’ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించకుండా తాలిబన్లకు సలహా ఇవ్వాలని అమెరికా, దాని నాటో మిత్రదేశాలు ఖతర్‌పై ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. కాగా, తాము తాలిబన్ల కొత్త ప్రభుత్వం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం లేదని రష్యా నిన్ననే తేల్చిచెప్పింది.  


తాలిబన్ల ప్రమాణ స్వీకారం రద్దు అయిన తర్వాత ఆఫ్ఘన్ కల్చరల్ కమిషన్ సభ్యుడు ఇనాముల్లా సమంగాని ట్వీట్ చేస్తూ.. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవాన్ని కొన్ని రోజుల క్రితమే రద్దు చేశామన్నారు. ప్రజలను గందరగోళానికి గురిచేయొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇస్లామిక్ ఎమిరేట్స్ కేబినెట్‌ను ప్రకటించిందని, అది ఇప్పటికే పని చేయడం ప్రారంభించిందని తెలిపారు.

Updated Date - 2021-09-12T00:51:34+05:30 IST