కోవిడ్ వ్యాక్సిన్‌పై బ్యాన్ విధించిన టెర్రరిస్టులు.. ఎక్కడంటే..!

ABN , First Publish Date - 2021-08-14T07:09:04+05:30 IST

కోవిడ్ వ్యాక్సిన్‌పై బ్యాన్ విధించడమేంటని ఆశ్చర్యపోతున్నారా..? కానీ ఇది నిజం. కరోనాను నిరోధించేందుకు ప్రపంచం మొత్తం వినియోగిస్తున్న ..

కోవిడ్ వ్యాక్సిన్‌పై బ్యాన్ విధించిన టెర్రరిస్టులు.. ఎక్కడంటే..!

కాబూల్: కోవిడ్ వ్యాక్సిన్‌పై బ్యాన్ విధించడమేంటని ఆశ్చర్యపోతున్నారా..? కానీ ఇది నిజం. కరోనాను నిరోధించేందుకు ప్రపంచం మొత్తం వినియోగిస్తున్న వ్యక్సిన్‌పై ఆఫ్ఘనిస్తాన్‌లో నిషేధం విధించారు. దేశంలోని ప్రధాన ప్రాంతాలతో పాటు దాదాపు ఆధిపత్యాన్ని సాధించిన తాలిబన్లు.. ఈ కొత్త నిబంధనను ప్రకటించారు. స్థానిక మీడియా వెల్లడించిన సమాచారం  ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్‌లోని తూర్పు ప్రాంతంలో ఉన్న పక్తియా ప్రొవిన్స్‌లో ఈ నిబంధనను తాలిబన్లు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాన్ని తాలిబన్లు గతవారం హస్తగతం చేసుకున్నారు. కాగా.. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లోని 34 ప్రావిన్స్‌లలో దాదాపు సగం వరకు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-08-14T07:09:04+05:30 IST