Abn logo
Apr 13 2021 @ 00:21AM

కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

పరవాడ, ఏప్రిల్‌ 12: కరాటే పోటీల్లో స్థానిక బ్రూస్‌లీరాజ్‌ మార్షల్‌ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబరచి పతకాలు సొంతం చేసుకున్నారు. తెలంగాణాలోని మాస్టర్‌ కేశవ్‌ కరాటే అకాడమీలో ఇటీవల నిర్వహించిన ఆన్‌లైన్‌ ఈ కాటా కరాటే చాంపియన్‌ షిప్‌లో ముత్యాలమ్మపాలెంకు చెందిన విద్యార్థులు కాటా, టీమ్‌ కాటా, వెపన్‌ కాటా విభాగాల్లో పాల్గొని 76 బంగారు పతకాలు, 30 రజత పతకాలు సాధించారని అకాడమీ చీఫ్‌ కోచ్‌ సిహాన్‌ అప్పలరాజు వెల్లడించారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన అభినందన సభలో సర్పంచ్‌ చింతకాయల సుజాతముత్యాలు, చింతకాయల ముత్యాలు విద్యార్థులను అభినందించారు. అకాడమీ అభివృద్ధికి రూ.10 వేలు అందజేశారు. కార్యక్రమంలో అకాడమీ చైర్మన్‌ సోంబాబు, ఎర్రబాబు, మైలపల్లి అప్పన్న ధనలక్ష్మి, అప్పలరాజు, శివ, శివాజీ పాల్గొన్నారు. 


  

Advertisement
Advertisement
Advertisement