ప్రతిభను వెలికితీయాలి : జడ్జి

ABN , First Publish Date - 2021-12-04T04:50:43+05:30 IST

దివ్యాంగుల్లో నూ దాగిఉన్న ప్రతిభను వెలికితీసి చేయూత అందించాలని పులివెందుల జూనియర్‌ సివిల్‌ జడ్జి పవన్‌కుమార్‌ పేర్కొన్నారు.

ప్రతిభను వెలికితీయాలి : జడ్జి
పులివెందుల భవిత కేంద్రంలో ఆయా అరుణను సత్కరిస్తున్న జడ్జి పవన్‌కుమార్‌

వేషధారణతో అలరించిన పిల్లలు 

వేడుకగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం

పులివెందుల రూరల్‌, డిసెంబరు 3: దివ్యాంగుల్లో నూ దాగిఉన్న ప్రతిభను వెలికితీసి చేయూత అందించాలని పులివెందుల జూనియర్‌ సివిల్‌ జడ్జి పవన్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని భవిత కేంద్రంలో సర్వశిక్ష అభియాన్‌, సమ్మిళిత విద్యా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆయన లూయీస్‌ బ్రెయిలీ చిత్రపటానికి నివా ళులర్పించారు.

అనంతరం మండల లీగల్‌ సర్వీస్‌ కమిటీ చట్టాలపై అవగాహన కలిగించారు. పదేళ్ల గా దివ్యాంగులకు సేవలందిస్తున్న ఆయా అరుణ ను జడ్జి సత్కరించారు. పలు ఆటల పోటీల్లో గెలు పొందిన దివ్యాంగ పిల్లలకు బహుమతులు అందిం చారు. కార్యక్రమంలో దివ్యాంగుల నెట్‌వర్క్‌ రాష్ట్ర అధ్యక్షుడు రఘునాథరెడ్డి, బార్‌ కౌన్సిల్‌  సభ్యులు, ఐఈఆర్టీలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మనోధైర్యంతో ముందుకు సాగాలి 

బద్వేలు రూరల్‌, డిసెంబరు 3: అంగవైకల్యం కలవారు మనోధైర్యంతో ముందుకు సాగుతూ అన్ని రంగాల్లో రాణించాలని ప్రిన్సిపాల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌. సరస్వతి పేర్కొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో భాగంగా జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణ, భవిత కేంద్రం లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె వీడియో కా ల్‌ ద్వారా దివ్యాంగులు, వారి తల్లులతో మాట్లాడా రు. అనంతరం మండల లీగల్‌ సర్వీసెల్‌ కమిటీ పండ్లు, బిస్కెట్లను దివ్యాంగులకు పంపిణీ చేశారు.

ల్యాబ్‌ టెక్నీషియన్‌ ప్రసాద్‌కుమార్‌, అడ్వకేట్‌ వర్మ, ఫిజయోథెరఫిస్టు డాక్టర్‌ మహబూబ్‌పీర్‌, భవిత ఉపాధ్యాయుడు రామచంద్రారెడ్డి, వెంకటసుబ్బ య్య, అడ్వకేట్లు జీజే ప్రభాకర్‌రావు, కే.బాబు, ప్యా రాలీగల్‌ వలంటీర్‌ రూకా ఓబయ్య పాల్గొన్నారు. 

  స్థానిక శ్రీనివాస కల్యాణ మండపంలో నిర్వహిం చిన దివ్యాంగుల దినోత్సవంలో ఎమ్మెల్సీ గోవిందరె డ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ మాట్లాడుతూ మానసిక స్థైర్యంతో దివ్యాంగులు వారు ఎంచుకున్న రంగాల్లో రాణించాలని కోరారు. సీనయ్య ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వికలాంగులకు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు దుప్పట్లను అందజేశారు.  కార్యక్రమంలో అనుడా చైర్మన్‌ సింగసాని గురుమోహన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ వా కమల్ల రాజగోపాల్‌రెడ్డి, సగర కార్పొరేషన్‌ చైర్మన్‌ గానుగపెంట రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. 

అలరించిన వేషధారణ

వేంపల్లె, డిసెంబరు 3: ప్రపంచ దివ్యాంగుల దినో త్సవం పురస్కరించుకుని వేంపల్లె భవిత కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేషధారణతో ది వ్యాంగ పిల్లలు అలరించారు. ఎంఐఎస్‌ జిల్లా  కోఆ ర్డినేటర్‌ లక్ష్మీనరసింహరాజు, ఉర్దూ కళాశాల ప్రిన్సి పాల్‌ హబీబుల్లా, జడ్పీ బాలుర పాఠశాల హెచ్‌ ఎం విజయకుమారి, మెయిన్‌ స్కూల్‌ హెచ్‌ఎం నరసింహారెడ్డి మాట్లాడారు. అనంతరం ఆటల పో టీల విజేతలకు బహుమతులు అందించారు.  సీఆర్పీలు, ఐఈఆర్టీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆత్మ స్థైర్యంతో అడుగేయాలి

అట్లూరు, డిసెంబరు 3: ఆత్మస్థైర్యంతో ముందడు గు వేస్తే సాధించలేనిది ఏమీ లేదని మండల విద్యాశాఖాధికారి విలియం రాజు అన్నారు. భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. జడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎం భాగ్యలక్ష్మి, ఐఈఆర్‌టీ దొరస్వామి, సీఆర్‌పీలు పాల్గొన్నారు. 

పిల్లలు దేవుళ్లతో సమానం

చక్రాయపేట, డిసెంబరు 3: దివ్యాంగ పిల్లలు దేవుళ్లతో సమానమని ఎంఈఓ రవీంద్రనాయక్‌ పేర్కొన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సం దర్భంగా నాగులగుట్టపల్లెలోని నాన్‌భవిత కేంద్రం లో పిల్లలు, తల్లిదండ్రుల సమావేశంలో  దివ్యాంగు ల ప్రతిభ గురించి, వారి ఎదుగుదల గురించి ఎంఈఓ వివరించారు. జడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎం సంజీవ్‌కుమార్‌, సర్పంచు శ్రీనివాసులు, ఐఈఆర్టీ లు సత్యనారాయణ, బాబాఫకృద్దీన్‌ పాల్గొన్నారు. 

అందరితో సమానంగా చూడాలి

పోరుమామిళ్ల, డిసెంబరు 3: దివ్యాంగులకు కూడా ప్రత్యేక శిక్షణ అందించి సమాజంలో అందరితో జీ వించేలా చేయాలని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులు శివప్రసాద్‌, పద్మనాభం అన్నారు. భవిత ప్రత్యేక అవసరాలు గల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మా ట్లాడారు. ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, ఉపాధ్యాయులు వీరశేఖర్‌, సరస్వతి, సునీత, సీఆర్పీ నరసింహ , సునీల్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 

విద్యలో రాణించాలి

కాశినాయన నవంబరు 3: దివ్యాంగ విద్యార్థులు ప్రభుత్వం అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని నర్సాపురం ప్రభు త్వ ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామసుబ్బారావు పేర్కొన్నారు. శుక్రవారం నర్సాపురం ఎమ్మార్సీ కార్యాలయంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఐఈఆర్‌టీ ఉపాధ్యాయుడు శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.  

దివ్యాంగులకు ప్రత్యేక పథకాలు

బ్రహ్మంగారిమఠం, డిసెంబరు 3: దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టింద న్నారు. ఎమ్మార్సీ భవనంలో మండల విద్యాశాఖాదికారి పుల్లయ్య, ఐఈడీ కోఆర్డినేటర్‌ రత్నప్రసాద్‌ పర్యవేక్షణలో ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. 



Updated Date - 2021-12-04T04:50:43+05:30 IST