విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయాలి

ABN , First Publish Date - 2021-12-05T06:07:28+05:30 IST

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలని డీఈవో రాధాకిసన్‌ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022లో భాగంగా శనివారం సిరిసిల్ల పట్టణం సీ నారాయణరెడ్డి కళామందిరంలో మున్సిపల్‌ ఆధ్వర్యంలో వ్యర్థాలతో వినూత్న కళాకృతుల తయారీ పోటీలను నిర్వహించారు.

విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయాలి
బహుమతి అందజేస్తున్న డీఈవో

జిల్లా విద్యాధికారి రాధాకిషన్‌

సిరిసిల్ల, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి)/సిరిసిల్ల టౌన్‌ : విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలని  డీఈవో రాధాకిసన్‌ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022లో భాగంగా శనివారం సిరిసిల్ల పట్టణం సీ నారాయణరెడ్డి కళామందిరంలో మున్సిపల్‌ ఆధ్వర్యంలో వ్యర్థాలతో వినూత్న కళాకృతుల తయారీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు వ్యర్థాలతో తయార చేసిన కళాకృతులను ప్రదర్శించారు.  జిల్లా విద్యాధికారి రాధాకిషన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య ప్రదర్శ నలను పరిశీలించారు. వ్యర్థాల కళాకృతల తయారు విధానాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం   ఏర్పాటు చేసిన సమావేశంలో ఐటీసీవావ్‌ ఈశ్రీ ఫౌండేషన్‌ సీఈవో అశ్రావ్‌, కందేపి రాణిప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు. వ్యర్థాలతో కళాకృతుల తయారీ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. అనం తరం  డీఈవో రాధాకిషన్‌  మాట్లా డుతూ వ్యర్థాలతో వస్తువులను తయారు చేయడం అభినందనీయం అన్నారు. పరిసరాలు పరిశుభ్రతపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలన్నారు.   ప్రతి ఒక్కరు వ్యక్తి గత పరిశుభ్రతను పాటించాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య మాట్లాడుతూ చాలా మంది విద్యా ర్థులలో ప్రతిభ ఉందనిచ భవిష్యత్‌లో పర్యావరణాన్ని కాపాడడం కోసం ఉపయోగించాలని అన్నారు. సిరిసిల్ల పట్టణంలో ఎక్కడ చెత్త కనబడిన ఉపేక్షించవద్దన్నారు. విద్యార్థుల నుంచే మార్పు కనిపించాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022లో సిరిసిల్ల పట్టణం మరో అవార్డు సాధించడంలో ప్రజలు, విద్యార్థుల కృషి ఉండాలన్నారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగస్వాములు కావాలి 

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అందరూ భాగస్వాములు కావాలని, ప్లాస్టిక్‌ వాడకాన్ని నిరోధించాలని సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య కోరారు. శనివారం సిరి సిల్ల గాంధీనగర్‌లోని రెయిన్‌బో పాఠశాలలో మున్సిపల్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యర్థ పదార్థాలతో రూపొందించిన వస్తువులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, వ్యర్థ పదార్థాలను చెత్తబుట్టల్లో వేయాలని, తడి, పొడిచెత్తను వేరు చేసి మున్సిపల్‌ వాహనాలకు అందించాలని అన్నారు. ఇంటి చుట్టుపక్కల నిల్వ నీటిని తొలగించా లన్నారు. నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెందుతాయని, డెంగ్యూ, మలేరియా వస్తుందని అన్నారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని నిరోధించి బట్ట సంచులను వాడాలన్నారు. వ్యర్థ పదార్థాలతోనూ రకరకాల వస్తువులను రూపొం దించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ నాగుల శ్రీనివాస్‌, ఐటీసీ ప్రతినిధి ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-05T06:07:28+05:30 IST