నేడు బీసీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

ABN , First Publish Date - 2022-07-03T04:57:43+05:30 IST

పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ఉత్తమ ప్రతిభకనబరిచిన బీసీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించనున్నట్లు బీసీ ప్రజా చైతన్య సమాఖ్య అధ్యక్షుడు బొర్రా రామంజనేయులు తెలిపారు.

నేడు బీసీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

ప్రొద్దుటూరు టౌన్‌, జూలై 2 : పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ఉత్తమ ప్రతిభకనబరిచిన బీసీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించనున్నట్లు బీసీ ప్రజా చైతన్య సమాఖ్య అధ్యక్షుడు బొర్రా రామంజనేయులు తెలిపారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం 5 గంటలకు విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందిస్తాని తెలిపారు. ఈ కార్యక్మంలో ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌, టీటీడీ పాలకమండలి మాజీ అధ్యక్షుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌, బీసీ కమిషన్‌ రాష్ట్ర సభ్యుడు ఎం.కృష్ణప్ప, ఆర్డీఓ శ్రీనివాసులు పాల్గొంటారని పేర్కొన్నారు.

నేడు పద్మశాలీయ విద్యార్థులకూ... పది, ఇంటర్మీడియట్‌ పరీక్షలో ప్రతిభకనబరిచిన పద్మశాలీ విద్యార్థులకు ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రతిభా పురస్కారాలు అందిస్తామని పద్మశాలీయ అభ్యుదయ సంఘం అధ్యక్షుడు వద్ది నరసింహులు తెలిపారు. పద్మశాలీయ కల్యాణ మండపంలో జరిగే ఈ కార్యక్రమంలో తిరుపతి ఏఎస్పీ జక్కా కులశేఖర్‌, ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ గుత్తికొండ కొండలరావు, పద్మశాలి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ జింకా విజయలక్ష్మి, రాయలసీమ ప్రాంత పద్మశాలీయ సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బి.లక్ష్మీదేవి చేతుల మీదుగా పురస్కారాలు అందిస్తామని వివరించారు. 

17న గాండ్ల విద్యార్థులకూ... 

పదోతరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రతిభకనబరిచిన గాండ్ల విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందిస్తామని గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగయ్య, ఉపాధ్యక్షుడు జీసీ పుల్లయ్య తెలిపారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడుతూ పదో తరగతిలో 450కిపైగా మార్కులు వచ్చిన వారు, ఇంటర్మీడియట్‌లో 800కు పైగా మార్కులు వచ్చిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందిస్తామన్నారు. ఈనెల 15వ తేదీలోపు విద్యార్థులు మార్కులిస్టు జిరాక్స్‌కాపీ, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో సంఘం కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. 17న కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రోత్సాహక బహుమతులు అందిస్తామన్నారు. సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షుడు కృష్ణయ్య, కార్యదర్శులు రామతులశయ్య, ప్రసాద్‌, సభ్యుడు శ్రీనివాసులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-03T04:57:43+05:30 IST